India Champions Trophy Squad: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తలపడే భారత జట్టు ప్రకటనపై కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. జవవరి 12వ తేదీ వరకే తుది జట్ల వివరాలు ఇవ్వాలని ఐసీసీ సూచించింది. కానీ బీసీసీఐ(BCCI) వారం రోజులు ప్రత్యేక అనుమతి కోరింది. దీంతో తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియాలో ఘోర వైఫల్యం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే టీమిండియా తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఫామ్‌లో ఉన్న పలువురు యువ క్రికెటర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే యువ ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం దక్కలేదు. అనుభవానికే సెలక్టర్లు ప్రాధాన్యం ఇచ్చారు. చీఫ్ సెలక్టర్(Chief Selector) అజిత్ ఆగార్కర్ ఆధ్వర్యంలో సమావేశమైన సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.
ఒక్కరు కూడా ఫామ్‌లో లేరు..
టీమిండియా తుది జట్టులో బ్యాట్స్‌మెన్స్‌గా రోహిత్‌శర్మ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశశ్వి జైశ్వాల్, రిషబ్ పంత్‌ను తీసుకున్నారు. ఆల్‌రౌండర్లుగా హార్ధిక్ పాండ్యా, వాషింగ్‌టన్ సుందర్‌ను ఎంపిక చేశారు. అయితే వీరిలో ప్రస్తుతం ఒక్కరు కూడా ఫామ్‌లో లేరు. వీరి గత ఆటతీరు చూస్తే.. ఒక్కరు కూడా రాణించిన దాఖలాలు లేవు. ఆస్ట్రేలియాలో రోహిత్‌శర్మ, శుభ్‌మన్ గిల్ విఫలమయ్యారు. కోహ్లి ఒక సెంచరీ చేశారు. యశశ్వి ఒక్కడే కాస్త రాణించాడు. శ్రేయస్ అయ్యర్ దేశవాలీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. మొత్తంగా చూస్తే యశశ్వి, శ్రేయస్ మాత్రమే కాస్త ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. దీంతో ఈ బ్యాట్స్‌మెన్స్‌లో పరుగల వరద ఎలా.. టార్గెట్ ఛేదించేది ఎలా అన్న సందేహాలు క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. అదృష్టవశాత్తు రోహిత్, శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి వస్తే మాత్రం టీమిండియాకు తిరుగు ఉండదు.
ఇద్దరు స్పిన్నర్లు..
ఇక టీమిండియా ఆడే మ్యాచ్‌లు అన్నీ దుబాయ్(Dubai) వేదికగానే జరుగుతాయి. ఈ నేపథ్యంలో సెలక్టర్లు క్రికెటర్ల ఎంపికలో సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది. ఇక దుబాయ్ పిచ్‌లు అన్నీ స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. అందుకే తుది జట్టులోకి ముగ్గురు స్పిన్నట్లను తీసుకున్నారు. కుల్‌దీప్‌తోపాటు జడేజా, అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించారు. జడేజా, వాషింగ్‌టన్ సుందర్ అటు బ్యాట్‌తోనూ రాణిస్తారు. ఇక బుమ్రా, హర్ష్‌దీప్‌సింగ్, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా సీమర్లుగా రాణిస్తారు. బుమ్రా మంచి ఫామ్‌లో ఉన్నాడు. షమీ కూడా దూకుడు ప్రదర్శించనున్నారు.
టీమిండియా షెడ్యూల్ ఇదీ..
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు గ్రూపులుగా జట్లను విభజించారు. మొత్తం 8 జట్లు ఆడననున్నాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదశ్, టీమిండియా గ్రూప్–ఏలో ఉనానయి. గ్రూప్ దశలె ఈ జట్లు ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఫిబ్రవరి 20 నుంచి ఈ టోర్నీలో టీమిండియా మ్యాచ్‌లు మొదలవుతాయి. మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. తర్వాత పాకిస్తాన్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది. లీగ్ దశలో చివరి మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. తర్వాత సెమీ ఫైలన్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.