IPL Schedule: ఈ ఏడాది జరిగి ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. భారత్ మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా జరుగనున్నాయి. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఇండియన్ ప్రీమియర్‌లీగ్ (ఐపీఎల్) ట్రోఫీ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. తాజాగా షెడ్యూల్‌లో స్వల్పంగా మార్పులు చేసింది. ఈనెల 22 నుంచి ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఆ సిరీస్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టు ఎంపిక కోసం కసరత్తు కొనసాగుతోంది. కాస్త సమయం కావాలని బీసీసీఐ ఐసీసీనికోరింది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చింది. మార్చి 23 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుంది. 65 రోజులపాటు సాగనున్న ఈ టోర్నీలో మే 25న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మొదట మార్చి 14న ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారుచేశారు. బిహార్ ఎన్నికలు, భద్రతా కారణాల దృష్ట్యా షెడ్యూల్ మార్పు చేశారు.
నెలాఖరుకు వేదికల ఖరారు..
ఇదిలా ఉంటే.. జనవరి చివరి వారంలో వేదికలు, మ్యాచ్‌ల వివరాల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం(జనవరి 12న) జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఐపీఎల్ వేలంలో అన్ని జట్ల కూర్పు పూర్తయింది. లక్నో సూపర్ జెయింట్స్ రికార్డు ధరతో రిషబ్ పంత్‌ను సొంతం చేసుకుంది. పంత్ కోసం రూ.27 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లతో కొనుగులు చేసింది.
భారత జట్టు ఎంపికకు కసరత్తు…
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా టీం ఎంపికకు కసరత్తు జరుగుతోంది. తుది జట్టు ఎంపిక కోసం ఈనెల 18, 19 తేదీల్లో కీలక సమావేశం జరుగనుంది. ఈనెల 12వ వరకు గుడువు ఉండగా, బీసీసీఐ గడువు కావాలని ఐసీసీని కోరింది. దీంతో వారం రోజులు గడువు పెంచింది. అయితే భారత జట్టు ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బూమ్రా కోసమే జట్టు ఎంపికను ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాలో బూమ్రా గాయపడ్డాడు. బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు. బూమ్రా ఫిట్‌నెస్‌పై క్లారిటీ వచ్చిన తర్వాత జట్టును ఎంపిక చేస్తారని తెలుస్తోంది.