Champions trophy 2025
Champions trophy 2025 : భారత జట్టు బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల పై విజయాలు సాధించి గ్రూప్ ఏలో మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. భారత్ సెమీఫైనల్ కు వెళ్లిన నేపథ్యంలో గ్రూప్ – బీ లో రెండవ స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా తో తల పడనుంది. దుబాయ్ వేదికగా మంగళవారం ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి 2023 వన్డే వరల్డ్ కప్ నాటి పరాభవానికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తున్నది. పైగా ఇప్పుడు ఆస్ట్రేలియా అంత బలంగా లేదు. స్టార్క్, హేజిల్ వుడ్, మార్ష్ జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలో ట్రావిస్ హెడ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అతడు భారత జట్టుతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కు దూరం అవుతాడని సమాచారం. ఆస్ట్రేలియా జట్టులో తాత్కాలిక కెప్టెన్ గా కొనసాగుతున్న స్మిత్ అంతగా రాణించడం లేదు. ఇలాంటి జట్టుతో జరిగిన మ్యాచ్లో షార్ట్, లబూ షేన్, జోష్ ఇంగ్లిష్, క్యారీ, మాక్స్ వెల్ అదరగొట్టారు. ఇప్పుడు భారత జట్టుతో జరిగే మ్యాచ్ లోనూ వీరు రాణిస్తారని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. మరోవైపు భారత్ ఈ టోర్నీలో ఇప్పటికే మూడు వరుస విజయాలు సాధించింది.. బలమైన జట్లను మట్టి కరిపించి అదరగొట్టింది. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే ఆస్ట్రేలియా పై భారత్ గెలుస్తుందని.. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓటమికి బదులు తీర్చుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.. అదే గనుక జరిగితే టీమిండియా ఫైనల్ వెళుతుందని పేర్కొంటున్నారు.
Also Read : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. నాకౌట్ షెడ్యూల్ ఇదీ.. వేదికలు, టైమింగ్స్..
ఇక రెండవ సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ (NZ vs SA) తలపడతాయి. పాకిస్తాన్ వేదిక ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే.. ఈ రెండు జట్లు 73 వన్డే మ్యాచ్లలో తలపడ్డాయి. న్యూజిలాండ్ 26 సార్లు, దక్షిణాఫ్రికా 42 సార్లు విజయం సాధించాయి. ఐదు మ్యాచ్లలో ఫలితం తేలలేదు. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 4 వికెట్లు నష్టానికి 357 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్, వాన్ డెర్ డాసన్ సెంచరీలు చేశారు. అనంతరం 358 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 167 పరుగులకే కుప్పకూలింది. ఇక ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్ కంటే బలంగా కనిపిస్తోంది. గత రికార్డులు కూడా దక్షిణాఫ్రికాకే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో.. సెమి ఫైనల్ మ్యాచ్ లోనూ దక్షిణాఫ్రికా గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ దక్షిణాఫ్రికా గనుక ఫైనల్ వెళితే 2024 t20 వరల్డ్ కప్ ఫైనల్ స్టోరీ రిపీట్ అవుతుందని.. భారత్ విజేతగా నిలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో భారత్ దక్షిణాఫ్రికా కంటే బలంగా ఉంది. ఇక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన లో స్కోర్ మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధించింది. అంటే ఇలా ఏ గణాంకాలు చూసుకున్నా టీమిండియా కే అనుకూలంగా ఉన్నాయి.
Also Read : టీమిండియా గెలిచింది.. దక్షిణాఫ్రికాకు రిలీఫ్.. న్యూజిలాండ్ కు దురాభారం..