Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్తాన్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆడిర రెండు లీగ్ మ్యాచ్‌లలో ఓడిపోయింది. సెమీస్ అవకాశాలను క్లిస్టతరం చేసుకుంది. భారత్(India) చేతిలో ఓడిపోవడంతో స్వదేశీ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో తాజాగా పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పేలవమైన టీం పెర్ఫార్మెన్స్(Perfarmance) ఒకవైపు ఉండగా, తాజాగా ఈ ట్రోఫీ కారణంగా ఏకంగా 100 మంది పోలీసులను సస్పెండ్ చేసే వరకు వెళ్లిందట. భద్రతా విధులు(Security duties)నిర్వహించే పంజాబ్ ప్రావిన్స్‌లోని కొందరు పోలీసులు నిరాకరించారు. దీంతో వారిపై అక్కడి సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. వేటుపడినవారంతా పోలీసు దళంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారే. ఐసీసీ టోర్నీ నేపథ్యంలో వారికి విధులు కేటాయించారు. కానీ, వంద మంది విధులకు హాజరు కాలేదు. సమాచారం లేకుండా డుమ్మా కొట్టారు. దీంతో వీరిని గుర్తించిన ప్రభుత్వం వారిపై సస్పెన్షన్ వేటు వేసింది.
ప్లేయర్లకు భద్రతగా ఉండకపోవడంతో..
లాహోర్‌లోని గడాఫీ స్టేడియం(Gadhafee Stadium) నుంచి టీమ్స్ బస చేసే హోటల్స్ వరకు ప్లేయర్లకు భద్రతగా ఉండేందుకు పోలీసులను కేటాయించారు. వారిలో కొందరు విధులకు రాలేదు. దీంతో క్రికెటర్ల సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా విదులకు రాని పోలీసులను సస్పెండ్ చేసినట్లు పంజాబ్ ప్రావిన్సు ఐజీపీ ఉస్మాన్ అన్వర్ తెలిపారు.
Also Read : మొన్న జాతీయ జెండా ఎగరవేయలేదు. నిన్న జెండా తీసుకొచ్చారని నానా యాగీ చేశారు.. పాకిస్తాన్ నిలువెల్లా విషమే
కారణం అందేనా..?
పెద్ద సంఖ్యలో పోలీసులు విధులకు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పాకిస్తాన్‌కు వచ్చిన వివిధ దేశాల క్రికెటర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకు విధులకు రాలేదని అంతా షాక్ అవుతున్నారు. దీనికి కారణం ఒకటి గుర్తించారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనతోపాటు చిత్తుగా ఓడిపోవడమే పోలీసులను నిరాశపర్చిందట. దీంతో క్రికెట్ విధులు నిర్వహించకూడదని కొందరు పోలీసులు నిర్ణయించుకున్నారట. ఈ కారణంగానే విధులకు గైర్హాజర్ అయి ఉంటారని అంటున్నారు. మరోవైపు సుదీర్ఘ పని గంటలు, అలసట కారణంగా, ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని కూడా సమాచారం. టోర్నీలో పాకిస్తాన్ వరుస ఓటములు, భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం, సమీస్ అవకాశాలు దాదాపు లేకపోవడం పాకిస్తాన్ క్రికెట్ అభిమానులనే కాదు పోలీసులను కూడా నిరాశపర్చిందన్న చర్చ జరుగుతోంది.
Also Read : అదే తగ్గించుకుంటే మంచిది.. పాకిస్తాన్ బౌలర్ తీరుపై మాజీ కెప్టెన్ అసంతృత్తి