Champions Trophy 2025 (3)
Champions Trophy 2025: మరి కొద్ది రోజుల్లో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ(Champions trophy 2025) జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐసీసీ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పాకిస్తాన్ భారత్(IND vs PAK) మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరుగుతుంది. భద్రతా కారణాల నేపథ్యంలో దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. భారత్ పాకిస్తాన్ దాయాదులు కావడంతో ఈ మ్యాచ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రెండు దేశాల మధ్య పోటీ అంటే ఉత్కంఠ తారా స్థాయిలో ఉంటుంది. గత రెండు ఐసీసీ టోర్నీలలో పాకిస్థాన్ పై భారత్ ఘనవిజయం సాధించింది. ఈసారి ఎలాగైనా భారత జట్టును ఓడించాలని పాకిస్తాన్ అభిమానులు కోరుకుంటున్నారు. పాకిస్తాన్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత ఆటగాళ్లు విముఖత చూపించారు. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్ళను ఆలింగనం చేసుకోవద్దని.. ఎట్టి పరిస్థితుల్లో వారితో కరచాలనం కూడా చేయొద్దని తమ క్రికెటర్లకు పాకిస్తాన్ అభిమానులు సందేశాలు పంపిస్తున్నారు. అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి పాకిస్తాన్ జర్నలిస్టు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సంచలనగా మారింది.
2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions trophy) నిర్వహించింది. భారత్ – పాకిస్తాన్ ఈ టోర్నీలో ఫైనల్ చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్లో భారత జట్టుపై పాకిస్తాన్ విజయం సాధించింది. గురు దశలో భారత జట్టుపై పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఫైనల్ మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ రెచ్చిపోయింది. భారత జట్టుపై ఘనవిజయం సాధించింది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించి..కప్ సొంతం చేసుకుంది. నాటి పాక్ జట్టుకు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 300కు పైగా స్కోర్ చేసింది.. ఆ తర్వాత భారత జట్టును పాకిస్తాన్ బౌలర్లు బెంబేలెత్తించారు. దీంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. అయితేనాడు పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించిన సర్ఫ రాజ్ అహ్మద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ” ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ విజేతగా నిలవడం ఇప్పటికి గర్వకారణంగానే ఉంటుంది. నాడు గ్రూప్ దశలో భారత్ చేతిలో మేము ఓడిపోయాం. ఆ తర్వాత మా మీద ఒత్తిడి పెరిగింది. విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. నాడు సీనియర్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, హాఫిజ్ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. అలాంటి ఆటగాళ్లు మా చుట్టూ ఉండడం అప్పట్లో గొప్పగా అనిపించింది. ఆ తర్వాత మా మైండ్ సెట్ పూర్తిగా మార్చేసుకున్నాం. జట్టులో సమూల మార్పులు చేశాం. ఆ తర్వాత మా ఆలోచన విధానం మారింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. ఫైనల్ మ్యాచ్లో మేము గెలిచామని” సర్ఫరాజ్ అహ్మద్ వ్యాఖ్యానించాడు.
Pakistan fans really angry with Indian cricket team
They want Pakistan players to not hug Indian players during Champions Trophy
— Farid Khan (@_FaridKhan) February 15, 2025