Champions Trophy 2025: భారత క్రికెటర్ల (team India players) జెర్సీల విషయంలో ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివాన లాగా మారింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిబంధనల ప్రకారం ఆటగాళ్లు ధరించే జెర్సీ(jercy) పై కచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ( champions trophy), ఆతిథ్య దేశం ( hosting country) పేరు ఉండాలి. ఏళ్ల నాటి వివాదాలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, రాజకీయంగా విభేదాలు వంటి కారణాలతో భారత్ – పాక్ మధ్య నిత్యం రగడ జరుగుతూనే ఉంటుంది. దీంతో పాకిస్తాన్ పేరు ముద్రించేందుకు బీసీసీఐ (BCCI) ఒప్పుకోవడం లేదని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో బీసీసీఐ ని ఐసీసీ గట్టిగా మందలించిందని తెలుస్తోంది. ఘాటు సందేశాన్ని కూడా పంపించిందని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అందులో ఏముందంటే..
” టోర్నీ నిర్వహించే దేశం తన క్రికెట్ జట్టు లోగో ముద్ర జెర్సీ పై కచ్చితంగా వేస్తుంది. అది ఆ జట్టు కనీస బాధ్యత కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొని టీమిండియా నిబంధనలు పాటించాలి. జెర్సీ, ప్లేయర్ల దుస్తులపై ఆతిధ్య దేశం పేరును ప్రతిబింబిస్తూ ఛాంపియన్స్ ట్రోఫీ లోగో ఉంటుంది. దీనిని అన్ని దేశాలు పాటించాలి. ఒకవేళ దీనిని టీమిండియా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని” ఐసీసీ అధికారి చెప్పినట్టు ఆంగ్ల మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ అధికారి మాట్లాడారు. ” ఈ కొంపలు మునిగిపోయేంత విషయం కాదు.. దీని గురించి అంతగా రచ్చ చేయాల్సిన అవసరం లేదు. రాద్ధాంతం చేయడానికి ఇందులో కొత్తగా ఏమీ లేదు.. భారత్ ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ మోడ్ విధానంలో దుబాయ్ లో జరుగుతున్నాయి. కాబట్టి ఇండియన్ ప్లేయర్లు ధరించే జెర్సీపై పాకిస్తాన్ పేరు ఉండాల్సిన అవసరం లేదు.. మా ఆటగాళ్లు దుబాయ్ లో ఆడుతున్నారు. పాకిస్తాన్ సొంత గడ్డలో ఆడటం లేదు. కాబట్టి జెర్సీపై వాళ్ల పేరు ఉండాల్సిన అవసరం లేదు.. ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ నేపథ్యంలో ఇదే దేశాల్లో ఏర్పాటు చేసిన పోడియాలపై పాకిస్తాన్ పేరును కనిపించేలాగా ప్రదర్శించారు. కానీ ఇండియాలో అలా చేయలేదు. అందువల్ల ఐసీసీ నిబంధన ప్రకారం టీమ్ ఇండియా జెర్సీపై కేవలం ఛాంపియన్ ట్రోఫీ లోగా ఉంటే సరిపోతుంది.. దాన్ని అదే విధంగా ముద్రిస్తామని” బీసీసీఐ అధికారి చెప్తున్నారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏం చెబుతోందంటే..
ఈ విషయంపై అంతకుముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా స్పందించింది. ” క్రికెట్ లోకి రాజకీయాలు తీసుకురావడం దురదృష్టకరం. బిసిసిఐ ఈ పని చేస్తోంది. దీనివల్ల ఆట అసలు లక్ష్యం పక్కకు వెళ్తోంది. పోటాపోటీ గా నిర్వహించే ఆటకు భారీగా నష్టం చేకూరుతోంది. ముందుగా భారత జట్టును మా దగ్గరికి పంపడానికి ఒప్పుకోలేదు. ఎనిమిది సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ట్రోఫీ ప్రారంభ వేడుకలకు వారి సారధిని పంపించలేదు. ఇప్పుడేమో వారి జెర్సీలపై మా దేశం పేరు ముద్రించడం లేదని” పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.