Ind vs Pak: భారత్, పాకిస్తాన్ మ్యాచ్లో మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తరఫున హార్దిక్ పాండ్యా తొలి వికెట్ తీసి, బాబర్ ఆజమ్ ను అవుట్ చేశాడు. ఆ తర్వాత అతను సౌద్ షకీల్ ను పెవీలియన్ కు పంపాడు. సౌద్ షకీల్ 62పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అభిమానుల దృష్టి హార్దిక్ పాండ్యా మైదానంలోకి ప్రవేశించేటప్పుడు ధరించిన వాచ్ వైపు మళ్లింది. ఈ వాచ్ ధర రూ. 15 కోట్లు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నాడు. అతనికి ఖరీదైన ఇల్లు, కోట్ల విలువైన కార్లు ఉన్నాయి. హార్దిక్ కి కూడా వాచీలు అంటే చాలా ఇష్టం. కానీ పాకిస్తాన్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ధరించిన వాచ్ నిజంగా రూ.15 కోట్ల విలువైనదేనా అన్న సందేహాలు వస్తున్నాయి. అసలు అంత ఖరీదైన వాచ్ పెట్టుకుని మ్యాచ్ ఆడతారా.. ఒక వేళ బాల్ తగిలితే వాచ్ పగిలిపోదా అని అభిమానులు మనసుల్లో ప్రశ్నలు మొదలయ్యాయి.
పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా.. రిచర్డ్ మిల్లె రాఫెల్ నాదల్ స్కెలిటన్ డయల్ ఎడిషన్ వాచ్ (రిచర్డ్ మిల్లె RM27-02 CA FQ టూర్బిల్లాన్) ధరించి మైదానంలోకి దిగాడు. ఈ వాచ్ ధర గురించి దాని అధికారిక వెబ్ సైట్లో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దాని షిప్పింగ్ ఛార్జీల గురించి మాత్రమే ఉంది. అయితే వాచ్ ధర తెలుసుకోవడానికి వెబ్సైట్లోని రిక్వెస్ట్ ఆఫ్షన్ పై క్లిక్ చేయాలి. వాస్తవానికి ఈ కంపెనీ గడియారాలు చాలా ఖరీదైనవి.. లగ్జరీవి. కాబట్టి దీని ధర కోట్లలో ఉంటుందని చెప్పవచ్చు. ఇది కాకుండా, హార్దిక్ పాండ్యా దగ్గర చాలా లగ్జరీ వాచీలు కూడా ఉన్నాయి.
దుబాయ్లో భారత్, పాకిస్తాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియా 242పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇప్పటి వరకు భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం 14వేల పరుగుల మైలు రాయిని దాటి రికార్డు నెలకొల్పాడు.