Yuzvendra Chahal Smoking Controversy: సెలబ్రిటీ గా ఉన్న వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి. మీరు ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అలాంటప్పుడు మీ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలి. ఒక ముక్కలో చెప్పాలంటే మీరు మీ రేంజ్ మరింత పెంచుకోవాలి. అలా కాకుండా ఏదైనా చేస్తాం. ఎలాగైనా ఉంటాం. మేమింతే.. మారమంతే అని అదనపు హంగులకు పోతే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఈ క్రికెటర్ పరిస్థితి కూడా అలానే మారిపోయింది.
ధనశ్రీ తో విడాకుల తర్వాత చాహల్ మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉన్నాడు. ఆ మధ్య టీమిండియా చాంపియన్ ట్రోఫీ ఫైనల్ ఆడినప్పుడు.. ఆ మ్యాచ్ చూసేందుకు ఓ రేడియో జాకీ తో కలిసి వెళ్ళాడు. ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. దీంతో తను ఆమెతో మింగిల్ అయినట్టు ప్రపంచానికి సిగ్నల్స్ ఇచ్చేశాడు. అది అతడి జీవితం.. కాబట్టి ఇందులో ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ చాహల్.. వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది గురిచేస్తోంది.
ఇటీవల అతడు కారు డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. చేతిలో సిగరెట్ ఉంది. సగం తాగిన సిగరెట్ ను అలా రోడ్డు మీద పడేశాడు. అంతకుముందు చాహల్ మద్యం తాగుతూ అనేకసార్లు రచ్చ రంబోలా చేశాడు. చివరికి మధ్య మానేసినట్టు చెప్పాడు. కానీ ఇప్పుడు సిగరెట్ తాగుతూ.. దాని మధ్యలోనే రోడ్డు మీద పాటిస్తూ తాను ఏదో అద్భుతమైన వ్యక్తిని అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు.
సినిమాలలో హీరోలు హీరో ఇజం ప్రదర్శించడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. అదంటే సినిమా కాబట్టి పెద్దగా ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ ఇది రియల్ లైఫ్ కదా.. అందులోనూ చాహల్ క్రికెటర్ కదా.. రియల్ లైఫ్ లో హీరో ఇజాన్ని ప్రదర్శిస్తూ అతడు చేసిన పని ఇబ్బందికరంగా ఉంది. అతడిని అనుకరిస్తూ మిగతా వారు అలానే చేస్తే సమాజం లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది కదా.. ఈ విషయం చాహల్ కు అర్థం కావడం లేదా.. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదా.. ధనశ్రీ తో విడాకుల తర్వాత చాహల్ కు చిప్ దొబ్బిందా.. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడా.. ఇదిగో ఇవే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మందు మానేశావ్ సరే.. ఈ మాయదారి గోల సంగతేంది.. ఈ సిగరెట్టు తాగడం ఏంటి.. సగం తాగిన ముక్క రోడ్డు మీద పడేయడం ఏంటి.. జర ఏదైనా హాస్పిటల్లో చూపించుకో అంటూ చాహల్ కు నెటిజన్లు హితవు పలుకుతున్నారు. అన్నట్టు చాహల్ ఐపీఎల్ లో పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్నాడు.