Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ: బ్యాటింగే కాదు.. ఆదాయంలోనూ దుమ్ము రేపుతున్నాడు..

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ: బ్యాటింగే కాదు.. ఆదాయంలోనూ దుమ్ము రేపుతున్నాడు..

Vaibhav Suryavanshi: 15 సంవత్సరాల ప్రాయంలో ఐపీఎల్లో సంచలనం సృష్టిస్తున్న ఆటగాడు వైభవ్ సూర్య వంశీ. ప్రస్తుత ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ విభాగంలో అతడు మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్, రోహిత్, సంజు లాంటి గొప్ప గొప్ప ప్లేయర్లు ఆడుతున్న ఐపీఎల్ లో.. వారందరికీ సాధ్యం కాని ఘనతను వైభవ్ సూర్య వంశీ సొంతం చేసుకున్నాడు.. రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఏమాత్రం భయం అనేది లేకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. […]

Vaibhav Suryavanshi: 15 సంవత్సరాల ప్రాయంలో ఐపీఎల్లో సంచలనం సృష్టిస్తున్న ఆటగాడు వైభవ్ సూర్య వంశీ. ప్రస్తుత ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ విభాగంలో అతడు మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్, రోహిత్, సంజు లాంటి గొప్ప గొప్ప ప్లేయర్లు ఆడుతున్న ఐపీఎల్ లో.. వారందరికీ సాధ్యం కాని ఘనతను వైభవ్ సూర్య వంశీ సొంతం చేసుకున్నాడు.. రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఏమాత్రం భయం అనేది లేకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు.

గౌహతి మైదానంలో ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో సింహ తాండవం చేశాడు వైభవ్ సూర్య వంశీ. బ్యాట్ ద్వారా బంతిని మైదానం నలుదిక్కులా పరుగులు పెట్టించాడు. దిగ్గజ బౌలర్ల బౌలింగ్ మొత్తాన్ని తుత్తునీయలు చేశాడు. వైభవ్ సూర్య వంశీ బ్యాటింగ్ తో సంచలన ఆటగాడిగా ఆవిర్భవించాడు. కేవలం పరుగులపరంగానే కాకుండా.. ఆదాయ పరంగా కూడా వైభవ్ సూర్య వంశీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు.

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇతడిని 1.10 కోట్లకు రిటైన్ చేసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం బీసీసీఐ ప్రతి మ్యాచ్ కు ఇక్కడికి 7.5 జీరో లక్షల ఫీజులు చెల్లిస్తోంది. లీడ్ దశలో ఇతడు గనుక అన్ని మ్యాచ్లు ఆడగలిగితే.. ఫీజుల రూపంలో దాదాపు 90 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఈ ప్రకారం చూసుకుంటే కాంట్రాక్టు మొత్తం తో కలిపి ఇతడికి రెండు కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. అతడు బీభత్సంగా ఆడుతున్న నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు అండర్స్ చేసుకోవడానికి క్యూలో ఉన్నాయి.

పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికే సూర్య వంశీ తండ్రితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. సూర్య వంశీ ఇదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తే అతడు మరింత అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో అతని తీరును భారత క్రికెటర్లు మొత్తం అభినందిస్తున్నారు. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత.. వైభవ్ సూర్య వంశీ ని టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభినందించాడు. గొప్ప ఇన్నింగ్స్ ఆడావని భుజం తట్టి.. శుభాకాంక్షలు తెలియజేశాడు. 15 సంవత్సరాలకే కోట్లల్లో సంపాదిస్తుంటే.. పాతిక సంవత్సరాల వయసు వచ్చేసరికి అతడు అంబానీని మించిపోతాడని సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper