Homeక్రీడలుVinesh Phogat: మీ కాస్ తీర్పులో మన్నువొయ్య.. క్లిష్టమైన కేసుల్లోనూ ఇన్ని వాయిదాలు ఉండవు కదరా..

Vinesh Phogat: మీ కాస్ తీర్పులో మన్నువొయ్య.. క్లిష్టమైన కేసుల్లోనూ ఇన్ని వాయిదాలు ఉండవు కదరా..

Vinesh Phogat : అప్పట్లో వచ్చిన యమలీల సినిమాలో.. తనికెళ్ల భరణి ” నాకొక బుల్లి చెల్లి. నేడే గల్లీలో పెళ్లి.. జరగాలి మళ్ళీ మళ్ళీ” అని రాస్తుంటాడు కదా.. సేమ్ అలానే ఒలింపిక్ లో భారత మల్ల యోధురాలు వినేశ్ ఫొగాట్ కేసులో కాస్(court of arbitration for sports) వ్యవహరిస్తోంది. ఈ కేసులో తీర్పులో మళ్ళీ మళ్ళీ వాయిదా వేస్తూ భారతీయులను నిరాశకు గురిచేస్తోంది.. బుధవారం తీర్పు వెలుపడుతుందని భావించగా.. దానిని మరోసారి వాయిదా వేసిన కాస్.. భారతీయులకు మరోసారి షాక్ ఇచ్చింది.. పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో మహిళల 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ దాకా చేరింది. రజత పతకం కచ్చితంగా వస్తుందని అంచనా వేసుకుంది. కానీ చివరి నిమిషంలో 100 గ్రాములు అధికంగా బరువు ఉందని నిర్వాహకులు ఆమెపై అనర్హత వేటు విధించారు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనల ప్రకారం అనర్హత వేటు ఎదుర్కొన్న మల్లయోధులు చివరి అంచె పోటీకి చేరినప్పటికీ.. చివరి ర్యాంకు ఇస్తారు. ఫలితంగా వినేశ్ కు ఎటువంటి మెడల్ దక్కలేదు..

సవాల్ చేస్తూ..

తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ వినేశ్ కాస్ గడప తొక్కింది. అయితే ఇప్పటికే ఆమెకేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పు వెలబడాల్సి ఉంది. వాస్తవానికి కాస్ బుధవారం రాత్రి తొమ్మిది గంటల 30 నిమిషాలకు తీర్పు ఇవ్వాలి. కానీ ఆ తీర్పును మరోసారి వాయిదా వేస్తూ కాస్ అటు వినేశ్, ఇటు భారతీయులను నిరాశను గురిచేసింది. ఆగస్టు 16న రాత్రి 9:30 నిమిషాలకు తుది తీర్పు ప్రకటిస్తామని కాస్ చెప్పింది. ఒకవేళ కాస్ తీర్పు అనుకూలంగా వస్తే వినేశ్ కు రజత పతకం లభిస్తుంది.

ఎదురులేకుండా..

పారిస్ ఒలంపిక్స్ లో జరిగిన కుస్తీ పోటీలలో వినేశ్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. వరల్డ్ నెంబర్ వన్ మల్లయోధురాలు సుసాకి (జపాన్) ను వినేశ్ ఓడించింది. రెండవ రౌండ్లో ఉక్రెయిన్ మల్లయోధురాలు లి వాచ్ ను మట్టి కరిపించింది. సెమీఫైనల్ లో క్యూబా మల్ల యోధురాలు గుజ్మాన్ ను గెలిచి ఫైనల్ చేరింది. ఫైనల్ లో ఆమె అమెరికా మల్ల యోధురాలు సారా తో తలపడాల్సి ఉంది. అయితే ఫైనల్ జరిగే రోజు 100 గ్రాముల అధిక బరువు ఉండటం వల్ల వినేశ్ పై అనర్హత వేటు పడింది.

ఒకేరోజు మూడు మ్యాచ్ లు ఉండడంతో..

వాస్తవానికి తొలి మ్యాచ్ ఆడే కంటే ముందు వినేశ్ 49 కిలోల బరువు మాత్రమే ఉన్నది. అన్ని పోటీలకు ఆమె అర్హత సాధించింది. అయితే ఒకేరోజు మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉండడంతో.. శక్తి కోసం ఆమె వివిధ రకాల ఆహార పదార్థాలు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె రెండు కిలోల బరువు పెరిగింది. వాస్తవానికి వినేష్ మినహా మిగతా మల్ల యోధులు అతి తక్కువ సమయంలో మూడు మ్యాచ్ లలో తలపడలేదు. అందువల్లే వారి బరువు నియంత్రణలో ఉంది..వినేశ్ బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. 100 గ్రాములు అదనంగా బరువు ఉండడంతో ఆమె అనర్హత వేటు ఎదుర్కొంది. బరువు విషయంలో రెజ్లింగ్ నిబంధనలు కఠినంగానే ఉన్నప్పటికీ.. ఒకే రోజు మూడు మ్యాచ్ లు నిర్వహించాలనే రూల్ లేదు. అయితే ఒలింపిక్ కాబట్టి ఒత్తిడి వల్ల ఒకేరోజు మూడు రెజ్లింగ్ మ్యాచ్ లు నిర్వహించారు. ఇదే విషయాన్ని వినేశ్ తరఫున న్యాయవాదులు కాస్ దృష్టికి తీసుకెళ్లారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular