Samantha: హీరోయిన్ సమంత స్టార్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తుందంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది. అందుకే సదరు దర్శకుడు ఆమెకు వరుస ఆఫర్స్ ఇస్తున్నారట. నాగ చైతన్య ఇటీవల శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ జరుపుకున్న నేపథ్యంలో ఈ ఎఫైర్ రూమర్ సంచలనంగా మారింది.
సమంత హీరో నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకుంది. సమంత డెబ్యూ మూవీ ఏమాయ చేసావే చిత్రంలో నాగ చైతన్య హీరో. ఈ రొమాంటిక్ లవ్ డ్రామా సూపర్ హిట్. సమంత-నాగ చైతన్య మధ్య కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై బాగా కుదిరింది. ఏమాయ చేసావే సమంతకు మంచి ఆరంభం ఇచ్చింది. అనంతరం సమంత నటించిన బృందావనం, దూకుడు భారీ విజయాలు సాధించడంతో సమంత స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. అదే సమయంలో ఆమె రహస్యంగా నాగ చైతన్యతో రిలేషన్ లో ఉంది.
పెళ్ళికి కొన్నాళ్ల ముందు తమ రిలేషన్ బహిర్గతం చేశారు. సమంత-నాగ చైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం కూడా సమంత నటన కొనసాగించింది. అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. నాగ చైతన్య, సమంత అభిమానులు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇటీవల నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. రెండేళ్లకు పైగా వీరు రిలేషన్ లో ఉన్నారని సమాచారం.
నాగ చైతన్య రెండో పెళ్ళికి సిద్ధమైన రోజుల వ్యవధిలో సమంత మీద ఎఫైర్ రూమర్స్ రావడం విశేషం. ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ డైరెక్టర్ రాజ్ తో సమంత డేటింగ్ చేస్తుందట. దర్శకత్వ ద్వయం రాజ్ అండ్ డీకే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో ఫేమస్ అయ్యారు. దానికి కొనసాగింపుగా వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సైతం విజయం సాధించింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలు చేశారు. సమంత శ్రీలంకకు చెందిన తమిళ్ రెబల్ రోల్ చేసింది.
సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2లో బోల్డ్ సీన్స్ లో నటించడం విశేషం. సమంత సెకండ్ వెబ్ సిరీస్ హనీ బన్నీ సైతం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కి హనీ బన్నీ ఇండియన్ వెర్షన్. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 7నుండి స్ట్రీమ్ కానుంది. బాలీవుడ్ మీడియాలో సమంత-రాజ్ ప్రేమలో ఉన్నారని కథనాలు వెలువడుతున్నాయి. రాజ్ నిడిమోరు తెలుగువాడే. ఆయనకు ఆల్రెడీ వివాహమైంది. అయితే భార్యతో విడిపోయాడని, విడాకులు తీసుకున్నాడని సమాచారం.
ఇక సమంతకు వరుసగా తన సిరీస్లలో రాజ్ ఆఫర్స్ ఇవ్వడం వెనుక కారణం ఇదే అంటున్నారు. మరి ఇదే నిజమైతే సంచలనం అని చెప్పాలి. ఒక దశలో సమంత రెండో వివాహం చేసుకోరంటూ కథనాలు వెలువడ్డాయి. నాగ చైతన్య విషయంలో ఆమె మానసిక వేదనకు గురైంది. తన జీవితంలో వివాహం, విడాకులు అనేది చీకటి అధ్యాయంగా ఆమె పరోక్ష కామెంట్స్ చేసింది. ఆధ్యాత్మిక బాట ఎంచుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సమంత ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నారంటూ వార్తలు వెలువడ్డాయి.
ఇప్పుడు సమంత-రాజ్ ఎఫైర్ నడుపుతున్నారన్న వార్తలు కాకరేపుతున్నాయి. మరి ఈ పుకార్లపై రాజ్ లేదా సమంత స్పందిస్తారేమో చూడాలి. సమంత నటించిన హనీ బన్నీ విడుదలకు సిద్ధం అవుతుంది. అలాగే సమంత ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ బ్యానర్ లో మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రకటించింది.
Web Title: Heroine samantha dating with the family man director raj
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com