Bumrah Retirement News : ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ఆటగాళ్లు లేని లోటును తీర్చడానికి బీసీసీఐ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇక వచ్చే నెలలో ఇంగ్లీష్ జట్టుతో జరిగే ఐదు టెస్టుల సిరీస్ కు మేనేజ్మెంట్ జట్టును ప్రకటించింది. గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది. రిషబ్ పంత్ ను ఉపసారథిగా నియమించింది. మొత్తంగా జట్టులో బుమ్రా మినహా మిగతా స్థానాలలో యంగ్ ప్లేయర్లను నియమించింది. యువ ప్లేయర్లతో ఇంగ్లీష్ దేశంలో పర్యటించే టీమ్ ఇండియా ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాల్సి ఉంది.. ఇక గిల్ కంటే ముందుగా సారధ్య బాధ్యతలు దక్కించుకునే జాబితాలో బుమ్రా పేరు ఎక్కువగా వినిపించింది. వాస్తవంగా అతడికున్న మెరిట్ ప్రకారం చూసుకుంటే కచ్చితంగా అవకాశం దక్కుతుందనే ప్రచారం జరిగింది. కాని చివరికి అనూహ్యంగా గిల్ కు సారథిగా అవకాశం దక్కింది. అతడి శరీర సామర్థ్యం సరిగా లేకపోవడం.. తరచుగా గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో.. అతడికి సారధ్య బాధ్యతలు అప్పగించలేదని ప్రచారం మొదలైంది. అయితే దీనిని కొంతమంది బీసీసీ పెద్దలు కూడా అంగీకరించారు.
Also Read : మరి కాసేపట్లో గుజరాత్ తో మ్యాచ్.. ముంబైకి కోలుకోలేని షాక్!
ఇప్పటికే టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో టెస్ట్ విభాగం కాస్త డీలా పడినట్టు కనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో బుమ్రా కూడా తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు..” అన్ని ఫార్మాట్లలో సుదీర్ఘకాలం కొనసాగడం కష్టం. శరీరం స్పందిస్తున్న తీరును అప్పుడప్పుడు అర్థం చేసుకోవాలి. కేవలం ముఖ్యమైన టోర్నీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. నేను గోల్స్, నెంబర్స్ ఏ మాత్రం సెట్ చేసుకోను. ఆటను ఆస్వాదిస్తుంటాను. నా ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాను. ఎప్పుడైతే నా శరీరం సహకరించదని అర్థమవుతుందో అప్పుడే నా ప్రయాణాన్ని ముగిస్తాను. రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకుంటాను. అప్పటిదాకా క్రికెట్ ఆడుతూనే ఉంటాను. ఎందుకంటే క్రికెట్ ద్వారానే నేను ఇక్కడ దాకా వచ్చాను. నాకు ఈ రోజు ఈ స్థాయిలో ఈ పేరు ఉందంటే దానికి ప్రధాన కారణం క్రికెట్ మాత్రమే. నా వంతుగా నేను నూరు శాతం ఎఫర్ట్ పెట్టడానికి ఎప్పుడూ వెనకడుగు వేయను. పైగా నా దేశం అన్ని విభాగాలలో అగ్రస్థానంలో ఉండాలని మాత్రమే కోరుకుంటాను. ఒక ఆటగాడిగా అది నా ప్రాధాన్యం కూడా” అని బుమ్రా ముగించాడు..
అయితే ఇటీవల తీవ్రంగా వెన్ను నొప్పితో బాధపడిన బుమ్రా.. చాలా నెలలు నేషనల్ క్రికెట్ అకాడమీకి పరిమితమయ్యాడు. చివరికి ఐపీఎల్ లో కూడా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ముంబై సాధిస్తున్న విజయాలలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. అంతకుముందు కంగారు జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో అదరగొట్టాడు.. అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు.