https://oktelugu.com/

MS Dhoni: తన సతీమణి సాక్షితో పాటు క్రికెటర్ ధోని బర్త్ డే వేడుకలో పాల్గొన్న ఒకే ఒక బాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..!

MS Dhoni: ధోని ఈ రోజు (జులై 7 ) న తన 44 వ బర్త్ డే ను సెలెబ్రేట్ చేసుకున్నారు.పుట్టిన రోజు సందర్భంగా ధోని తన ఇంట్లో అర్ధరాత్రి సమయంలో బర్త్ డే కేక్ ను కట్ చేసారు.ఇక ఈ వేడుకలో తన సతీమణి సాక్షి తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు.శనివారం అర్ధరాత్రి సమయంలో ధోని(Dhoni) తన సతీమణి సాక్షి(Sakshi) మరియు సల్మాన్ ఖాన్(Salman Khan) తో కలిసి కేక్ ను కట్ చేసారు.ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ కు సంబంధిచిన వీడియొ ధోని సతీమణి సాక్షి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు.ధోని బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు ధోనికి విషెస్ తెలుపుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 7, 2024 / 09:45 PM IST

    MS Dhoni

    Follow us on

    MS Dhoni:  ప్రపంచంలో క్రికెట్ ఆటను ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు.క్రికెట్ వస్తుందంటే చాలు అందరు తమ ఇండ్లలో టీవీ లకు అతుక్కుపోతుంటారు.అలాంటి ప్రపంచ క్రికెట్ లో ఒక చరిత్రను సృష్టించి తనకంటూ స్పెషల్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు మహీంద్ర సింగ్ ధోని.ధోనీని అభిమానులు తలైవా,కెప్టెన్ కూల్,తల జార్ఖండ్ డైనమేట్,ద ఫినిషర్ అని అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారు.మహీంద్ర సింగ్ ధోని 2011 లో ప్రపంచ కప్,అలాగే 2007 లో T 20 ప్రపంచ కప్ ను భారత్ కు అందించి అభిమానుల గుండెల్లో చెరగని ముంద్రను సంపాదించుకున్నారు.

    ధోని ఈ రోజు (జులై 7 ) న తన 44 వ బర్త్ డే ను సెలెబ్రేట్ చేసుకున్నారు.పుట్టిన రోజు సందర్భంగా ధోని తన ఇంట్లో అర్ధరాత్రి సమయంలో బర్త్ డే కేక్ ను కట్ చేసారు.ఇక ఈ వేడుకలో తన సతీమణి సాక్షి తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు.శనివారం అర్ధరాత్రి సమయంలో ధోని(Dhoni) తన సతీమణి సాక్షి(Sakshi) మరియు సల్మాన్ ఖాన్(Salman Khan) తో కలిసి కేక్ ను కట్ చేసారు.ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ కు సంబంధిచిన వీడియొ ధోని సతీమణి సాక్షి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు.ధోని బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు ధోనికి విషెస్ తెలుపుతున్నారు.

    చైన్నై టీం ధోనికి ఒక అద్భుతమైన వీడియొ తో బర్త్ డే విషెస్ తెలిపారు.ఈ క్రమంలోనే అభిమానులు క్రికెట్ ప్రపంచంలో ధోని క్రియేట్ చేసిన రికార్డులను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.ధోని బర్త్ డే సందర్భంగా #HBDMSDhoni హాష్ టాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ధోని తన పుట్టిన రోజును ఇంట్లోనే చాల సాధారణంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ అందుకు సంబంధించిన వీడియొ ఒకటి అభిమానులతో పంచుకున్నారు.సల్మాన్ ఖాన్ హ్యాపీ బర్త్ డే కెప్టెన్ సాహబ్ అంటూ సోషల్ మీడియా ద్వారా ధోనికి విషెస్ తెలిపారు.ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రెమ్ లో ఉండటంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది.

    సోషల్ మీడియాలో వీరిద్దరి అభిమానులు బాలీవుడ్ బాప్,క్రికెట్ బాప్ కలిస్తే రచ్చే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక డ్రీమ్ కమ్ ట్రూ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సాక్షి సింగ్ ఈ వీడియొ ను షేర్ చేస్తూ తన భర్త ధోని కి బర్త్ డే విషెస్ తెలిపారు.కేక్ కట్ చేసిన తర్వాత ధోని మొదట తన భార్య కు కేక్ ను తినిపించారు.ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కు ధోని కేక్ తినిపించారు.ఈ క్రమంలోనే సాక్షి సింగ్ తన భర్త ధోని కాళ్లకు నమస్కరించింది.ఎంతో సరదాగా ఉన్న ఈ వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతుంది.