Blow to RCB fans: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక అభిమానుల అండదండలు ఉన్న జట్లలో బెంగళూరు ముందు వరుసలో ఉంటుంది. ఈ జట్టు 2008 నుంచి 2024 వరకు ఐపీఎల్ ట్రోఫీ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. కొన్ని సందర్భాలలో ఫైనల్ దాకా వెళ్ళినప్పటికీ ట్రోఫీ అందుకోకుండానే వెనక్కి వచ్చేసింది. అయితే 2025లో మాత్రం అద్భుతం జరిగింది.. బెంగళూరు జట్టు ఊహించిన ఫలితం వచ్చింది. ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ జట్టును ఓడించి.. బెంగళూరు ఐపిఎల్ విజేతగా నిలిచింది.
ఐపీఎల్ గెలిచిన తర్వాత బెంగళూరు యాజమాన్యం సొంత మైదానంలో నిర్వహించిన విక్టరీ పరేడ్ తీవ్రమైన విషాదానికి దారితీసింది. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం.. అభిమానుల అత్యుత్సాహం బెంగళూరులో విషాదం నింపింది. చాలామంది అభిమానులు దూసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో చాలామంది అభిమానులు చనిపోయారు. చాలామంది అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక రకంగా ఈ ఘటన బెంగళూరు జట్టుకు కళంక తెచ్చిపెట్టింది. దీని నుంచి బయట పడడానికి బెంగళూరు జట్టు యాజమాన్యం చేయని ప్రయత్నం అంటూ లేదు. తాజాగా బెంగళూరు యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా బెంగళూరు యాజమాన్యం ప్రకటించకపోయినప్పటికీ.. ఇది నిజమే అయి ఉంటుందని తెలుస్తోంది.
ఇటీవల తొక్కిసలాట జరిగిన తర్వాత బెంగళూరు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది హోమ్ గ్రౌండ్ మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో ఆడకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దానికి బదులుగా మహారాష్ట్రలోని పూనే స్టేడియంలో ఆడాలని బెంగళూరు యాజమాన్యం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒకవేళ గనుక జరిగితే బెంగళూరు తన మ్యాచ్లను హోం గ్రౌండ్లో ఆడక పోవడం ఇదే తొలిసారి అవుతుంది. ఈ నిర్ణయం వల్ల బెంగళూరు జట్టు అభిమానులకు తీవ్రస్థాయిలో నిరాశ మిగులుతుంది.
బెంగళూరు యాజమాన్యం విక్టరీ పరేడ్ సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. అభిమానులు దూసుకు రాకుండా.. గేట్లు తీసి ఉంచితే బాగుండేది. అలా కాకుండా యాజమాన్యం గేట్లను మూసివేయడం.. అభిమానులను లోపలికి రాకుండా అడ్డుకోవడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. అది కాస్త పెను ప్రమాదానికి దారి తీసింది. అందువల్లే ఈ స్థాయిలో ప్రాణ నష్టం చోటుచేసుకుంది. అప్పటినుంచి బెంగళూరు యాజమాన్యంపై ఏదో ఒక రూపంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆ ఒత్తిడిని తట్టుకోలేక బెంగళూరు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.