Bhuvneshwar Kumar: వేగంగా బంతులు వేయగలడు. వేసిన బంతి మీద నియంత్రణ సాగించగలడు. కేవలం హాఫ్ సైడ్ మాత్రమే కాదు.. లెగ్ సైడ్ కూడా స్వింగ్ చేయగలడు. నిర్జీవమైన పిచ్ నుంచి కూడా సహకారం అందుకోగలడు. దూకుడుగా ఆడే బ్యాటర్లకు ముకుతాడు వేయగలడు. అందువల్లే అతడు స్వింగ్ కింగ్ గా పేరుపొందాడు. అటువంటి బౌలర్ టీమిండియా కు అద్భుతమైన సేవలు అందించినప్పటికీ.. మేనేజ్మెంట్ రాజకీయాల వల్ల కొద్దిరోజులుగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడే భువనేశ్వర్ కుమార్. ఇటీవల జరిగిన ఐపిఎల్ లో బెంగళూరు జట్టు ట్రోఫీ అందుకుందంటే అందుకు ప్రధానమైన కారణాలలో భువనేశ్వర్ కుమార్ కూడా ఒకడు.
Also Read: ఈ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకు.. చివరకు 13 ఏళ్ల బాలికను కూడా వదలలేదు!
భువనేశ్వర్ కుమార్ ఖాతాలో 294 అంతర్జాతీయ వికెట్లు ఉన్నాయి. 2013 లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుపొందడంలో భువనేశ్వర్ కీలకపాత్ర పోషించాడు. 2016లో హైదరాబాద్ జట్టు ఐపిఎల్ గెలుపొందడంలోనూ తన వంతు పాత్ర పోషించాడు. 2016, 2017లో ఐపీఎల్ లో ఉదా రంగు టోపీలను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత డాట్ బాల్స్ వేసిన బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు అన్ని ఫార్మాట్లలో ఐదు వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్ గా చరిత్రకు ఎక్కాడు. అన్ని ఫార్మాట్లలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలు అందుకున్న బౌలర్ గానూ రికార్డ్ సృష్టించాడు. మేనేజ్మెంట్ లో నెలకొన్న రాజకీయాల వల్ల భువనేశ్వర్ కుమార్ కొద్దిరోజులుగా జాతీయ జట్టుకు ఎంపిక కావడం లేదు. అయినప్పటికీ దేశవాళి టోర్నీలలో.. ఇతర ట్రోఫీలలో అదరగొడుతున్నాడు.
ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ ఉత్తరప్రదేశ్ టీ 20 లీగ్ లో ఆడుతున్నాడు. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్లో తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండువైపులా బంతిని స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏ మాత్రం పరుగులు తీయడానికి అవకాశం ఇవ్వకుండా.. వైవిధ్యమైన బంతులు వేస్తూ ఆకట్టుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నది.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ శైలిని అందరూ మెచ్చుకుంటున్నారు. “భువనేశ్వర్ జాతీయ జట్టుకు దూరమైనప్పటికీ అతని క్లాస్ మిస్ కాలేదు. అతడు క్లాస్ బౌలింగ్ వేయడంలో సిద్ధహస్తుడు. అతని గురించి ఎంత చెప్పినా తక్కువేనని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
CLASS IS PERMANENT!
Bhubaneswar kumar in UPT20 League.
pic.twitter.com/eyJCCrW820— Ashu Kharwar (@AshuKharwa66211) August 23, 2025