Santosh Trophy: మనదేశంలో ఫుట్ బాల్ (football) కు సంబంధించి సంతోష్ ట్రోఫీ (Santosh trophy) నిర్వహిస్తారు.. ఇటీవల జరిగిన ఈ టోర్నీలో పశ్చిమబెంగాల్ (West Bengal) జట్టు విజయం సాధించింది. ముచ్చటగా 33 వ సారి ట్రోఫీని దక్కించుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్ (West Bengal) ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించింది.. ఈ టోర్నీలో పశ్చిమబెంగాల్ విజయానికి కారణమైన 22 మంది ఆటగాళ్లకు నజరానాతో పాటు పోలీసు ఉద్యోగాలను కూడా ఇస్తున్నట్టు వెల్లడించింది. జాతీయస్థాయిలో ఇంత పేరున్న సంతోష్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ టోర్నీలో బెంగాల్ జట్టు ఏకంగా 33 వ సారి ట్రోఫీని దక్కించుకుంది. ఈ విజయంలో పాలుపంచుకున్న ఆటగాళ్లకు పోలీసు భాగంలో ఉద్యోగాలు ఇస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.. వారందరిని కూడా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా నియమిస్తున్నట్టు తెలుస్తోంది.
సన్మానం
సంతోష్ ట్రోఫీలో పశ్చిమబెంగాల్ విజయానికి కారణమైన ఆటగాళ్లకు సన్మాన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ పాల్గొన్నారు. ట్రోఫీ గెలవడానికి కృషి చేసిన ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు ఆ 22 మందికి పోలీసు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి చేశామని పేర్కొన్నారు. ఇక జట్టులో సభ్యులకు 50 లక్షలు నజరానా ఇస్తున్నట్టు వెల్లడించారు.. ఇటీవల హైదరాబాదులోని గచ్చిబౌలి మైదానంలో సంతోష్ ట్రోఫీ ఫైనల్ జరిగింది. చివరి పోరులో కేరళ జట్టును బెంగాల్ జట్టు 1-0 తేడాతో ఓడించింది. 33 వ సారి ఛాంపియన్ గా గెలిచింది. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్ రెండు జట్ల మధ్య హోరాహోరీగా జరిగింది. ఒకానొక దశలో మ్యాచ్ అదనపు సమయం వరకు వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇంజురీ సమయం చోటు చేసుకున్నప్పుడు రాబి ఆట 94వ నిమిషంలో బంతిని నెట్ లోకి పంపించాడు. బెంగాల్ జట్టుకు విజయాన్ని అందించాడు.. బెంగాల్ క్రీడాకారుడు హెడర్ ద్వారా బంతిని అందించగా.. రాబి దానిని నెట్లోకి పంపించాడు.. మొత్తంగా బెంగాల్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని ఖాయం చేశాడు. పశ్చిమ బెంగాల్లో యువకులు ఎక్కువగా ఫుట్ బాల్ ఆడుతుంటారు. అందువల్లే సంతోష్ ట్రోఫీలో పశ్చిమ బెంగాల్ జట్టు వరుస విజయాలు సాధిస్తోంది. ఏకంగా 33 వ సారి ట్రోఫీని దక్కించుకుందంటే మాటలు కాదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలావరకు ఫుట్ బాల్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయంటే.. అక్కడ ఆ క్రీడకు ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగాల్ ప్రభుత్వం కూడా ఫుట్ బాల్ అభివృద్ధికి విశేష కృషి చేస్తోంది.