T20 World Cup PAK vs ENG : 2016 టీ20 ప్రపంచకప్.. ఫైనల్ లో వెస్టిండీస్ తో ఇంగ్లండ్.. లాస్ట్ ఓవర్.. ఆరు బంతుల్లో 19 పరుగులపైనే చేయాలి. వెస్టిండీస్ కు అప్పటికే లోయర్ ఆర్డర్ వరకూ వికెట్లు పడిపోయాయి. బౌలర్ బ్రాత్ వెట్ క్రీజులో ఉన్నాడు. చివరి ఓవర్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వేశాడు. చివరి నాలుగు బంతుల్లో నాలుగు సిక్సులు కొట్టిన బ్రాత్ వైట్ వెస్టిండీస్ కు టీ20 కప్ ను అందించాడు. బెన్ స్టోక్స్ పాలిట పీడ కలను మిగల్చాడు. 2016 వరల్డ్ కప్ లో బ్రాత్ వైట్ వెస్టిండీస్ కు హీరోగా మిగలగా.. ఇంగ్లండ్ తరుఫున బెన్ స్టోక్స్ జీరోగా మిగిలాడు. నాడు ఎంతో మంది బెన్ స్టోక్స్ ను తీవ్రంగా విమర్శించాడు. అందుకే 2019 వన్డే వరల్డ్ కప్ లోనూ అతడే 84 రన్స్ చేసి ఇంగ్లండ్ కు కప్ తెచ్చిపెట్టాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ను సాధించిపెట్టాడు. ఆ బాధను మరిపించి హీరోగా మిగిలాడు.
కానీ ఇప్పుడు 2022 వరల్డ్ కప్ లో బలమైన పాకిస్తాన్ పై ఓవైపు వికెట్లు పడుతున్నా కూడా బెన్ స్టోక్స్ ఒక్కడే నిలబడ్డాడు. ఓవైపు గట్టి పునాది వేశాడు. ఒకనొక దశలో కేవలం 72 స్ట్రైక్ రేటుతో 32 బంతుల్లో 22 మాత్రమే చేశాడు. కానీ చివరకు పుంజుకొని 49 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. నిప్పులు చెరిగే పాకిస్తాన్ బౌలర్లను కాచుకొని సులువైన ఇఫ్తికార్ అహ్మద్ స్పిన్ బౌలింగ్ లో దంచికొట్టి ఇంగ్లండ్ ను విజయానికి చేరువ చేశాడు. చివరి వరకూ క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు.
పాకిస్తాన్ తో ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ను గెలిపించింది ఖచ్చితంగా బెన్ స్టోక్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా 4 ఓవర్లలో 12 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసిన సామ్ కర్రన్ కూడా మ్యాచ్ ప్రజంటేషన్ వేళ బెన్ స్టోక్స్ కే ఈ అవార్డ్ ఇవ్వాలని అన్నాడంటే అతడెంత గొప్పగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు.
కీలకమైన ఫైనల్ లో కెప్టెన్ జోస్ బట్లర్, హేల్స్ త్వరగా అవుట్ అయితే జట్టుకు ఒక పక్క అండగా నిలబడి లక్ష్యం దిశగా టీంను నడిపించిన తీరు అద్భుతమే అని చెప్పాలి. మొత్తంగా నాడు 2016లో టీంకు కప్ ను దూరం చేశానన్న బాధతో ఏమో ఈరోజు 2022 ఫైనల్ లో చివరి వరకూ ఉండి జట్టుకు కప్ ను అందించాడు బెన్ స్టోక్స్. ఇంగ్లండ్ ను ప్రపంచ విజేతగా నిలబెట్టాడు.