Virat Kohli: టీమిండియాలో స్టార్ ఆటగాడిగా విరాట్ కోహ్లీకి గుర్తింపు ఉంది. సమకాలీన క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన సామర్థ్యం అతడి సొంతం. ఆటగాడిగా, నాయకుడిగా టీమిండియాకు అతడు అద్భుతమైన విజయాలు సాధించిపెట్టాడు. అతని నాయకత్వంలో టీమిండియా ఏకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ దాకా వెళ్ళింది. అంతేకాదు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బలమైన ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. టీమిండియా కష్టకాలంలో ఉన్న ప్రతి సందర్భంలోనూ విరాట్ కోహ్లీ ఒక యోధుడి లాగా బ్యాటింగ్ చేశాడు. 2022లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టుతో టీమిండియా తలపడిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ చిరస్మరణీయంగానే ఉంది. ఆ ఇన్నింగ్స్ గురించి ఇప్పటికి కథలు కథలుగా చెప్పుకుంటారు.
విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు, అదే స్థాయిలో నాయకుడు కూడా. అందు గురించే అతడిని మన దేశానికి చెందినవారు మాత్రమే కాకుండా.. ఇతర దేశాలకు చెందినవారు కూడా విపరీతంగా అభిమానిస్తుంటారు. ఆరాధిస్తుంటారు. అంతటి విరాట్ కోహ్లీ ప్రస్తుతం సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. దానికంటే ముందు పొట్టి ఫార్మాట్ నుంచి దూరం జరిగాడు. ఇప్పుడు కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కొంతకాలంగా అతడు కుటుంబంతో కలిసి లండన్ లో ఉంటున్నాడు. అక్కడే స్థిరపడాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే వరల్డ్ కప్ వరకు కొనసాగాలని అతడు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత శరీర సామర్థ్యం ప్రకారం చూసుకుంటే అతడు అప్పటివరకు కొనసాగడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. బీసీసీఐ కూడా దానికి అంగీకరించవచ్చు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఒక పరిణామం విరాట్ కోహ్లీ పరిమితం వల్ల క్రికెట్ ఆడతాడా? లేదా? అనే ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కంటే ముందు ఆస్ట్రేలియా ఏ జట్టుతో వన్డే సిరీస్ ఆడాలని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బీసీసీఐ సూచించింది. అయితే ఇప్పటికే రోహిత్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కోహ్లీ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రాక్టీస్ ప్రారంభించలేదు. అంతే కాదు అతని నుంచి బీసీసీఐకి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో అతడు ఆడే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్ లో ఉన్నాడు. అక్కడ ఒక నివాసాన్ని కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.