Mullanpur Stadium : ఇక ప్రస్తుతం ఐపీఎల్ లో గ్రూప్ దశ మ్యాచ్ లు దాదాపుగా ముగిసినట్టే. తదుపరి ప్లే ఆఫ్ మ్యాచ్ లకు బిసిసిఐ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ప్లే ఆఫ్ మ్యాచ్ల విషయంలో ట్విస్ట్ ఇచ్చింది. నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్ ల నిర్వహణకు సంబంధించి వేదికల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ముల్లన్ పూర్, అహ్మదాబాద్ లో ప్లే ఆఫ్ మ్యాచ్ లు నిర్వహిస్తామని ప్రకటించింది. ముల్లన్ పూర్లో న్యూ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇప్పటికే నాలుగు లీగ్ మ్యాచ్లు జరిగాయి. ఇక కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్లు కూడా ఇక్కడ జరుగుతాయి. దీంతో ఈ స్టేడియానికి మహర్దశ పట్టిందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
మే 29న ముల్లాన్పూర్లో క్వాలిఫైయర్ -1 మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత మేము పోయిన ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. మే 29న జరిగే క్వాలిఫైయర్ -1 మ్యాచ్ కోసం ఇక్కడి అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో క్వాలిఫైయర్ -2, గ్రాండ్ ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. క్వాలిఫైయర్ -1 లో ఓడిపోయిన జట్టుకు, ఎలిమినేటర్ విజేతమధ్య క్వాలిఫైయర్ -2 మ్యాచ్ జూన్ 1న జరుగుతుంది. ఇక జూన్ 3న ఇదే వేదికలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.” వాతావరణ పరిస్థితులు.. ఇతర విషయాలను పరిగణలోకి తీసుకొని ఐపీఎల్ పాలకమండలి వేదికల మార్పులు నిర్ణయించింది. వాస్తవానికి ఈ చివరి 4 గేమ్స్ కు హైదరాబాద్, కోల్ కతా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.. కానీ అనుకోని పరిస్థితుల వల్ల వేదికలు మారిపోయాయని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read : పాక్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ.. దాయాది దేశానికి ఎంత కష్టం!
ముల్లాన్ పూర్ లో ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 20 వరకు పంజాబ్ జట్టు లీగ్ దశ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చింది. పంజాబ్, బెంగళూరు, గుజరాత్ జట్లు ప్లే ఆఫ్ లో తమ స్థానాన్ని నిర్ధారించుకున్నాయి. ఇక ఢిల్లీ, ముంబై నాలుగో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. వాస్తవానికి అన్ని అనుకున్నట్టుగా జరిగితే..చివరి నాలుగు మ్యాచులు హైదరాబాద్, కోల్ కతా వేదికగా నిర్వహించేవారు. అయితే అనుకోకుండా ఉగ్రవాద దేశంతో ఉద్రిక్తత ఏర్పడిన నేపథ్యంలో.. ప్లే ఆఫ్ మ్యాచ్ లకు వేదికలు మారాయి. ఫైనల్ మ్యాచ్ వేదిక కూడా మారింది. దీంతో ముల్లాపూర్ మైదానానికి మహర్దశ పట్టింది. కీలకమైన మ్యాచులు జరుగుతున్న నేపథ్యంలో ఈ మైదానంలో భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. రాష్ట్ర పోలీసులు మాత్రమే కాకుండా, కేంద్ర బలగాలు కూడా ఇక్కడ పహారా కాస్తున్నాయి. ఇక పంజా ప్రభుత్వం కూడా రాష్ట్ర పోలీసులను ఇక్కడ భారీగా మోహరించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి భద్రతను మరింత పటిష్టం చేసింది.