Roger Binny Resigns: భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రపంచంలోనే అతిపెద్ద సంపన్న బోర్డుగా కొనసాగుతోంది. క్రికెట్ మీద చాలా సంవత్సరాలుగా పెత్తనం సాగిస్తోంది. పేరుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఉన్నప్పటికీ.. దానిమీద పెత్తనం మొత్తం భారత క్రికెట్ నియంత్రణ మండలిదే. అయితే ఆ స్థాయిలో ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రాజీనామా చేశారు. ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేసి ఆయన సంచలనం సృష్టించారు.
Also Read: టీఆర్పీ రేటింగ్స్ : బ్రహ్మముడి అధ: పాతాళానికి.. వంటలక్క టాప్ లోకి
భారత క్రికెట్ నియంత్రణ మండలికి అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ కొనసాగుతున్నారు. ఆకస్మాత్తుగా ఆయన తప్పుకున్నారు. ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా బాధితులు స్వీకరిస్తారని తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పటివరకు రాజు ఆ పదవిలో ఉంటారని సమాచారం.. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వచ్చే బుధవారం బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీ ఉంటుందని తెలుస్తోంది.. అయితే ఇందులో భారత జట్టుకు ప్రధాన ప్రయోజన కర్తగా వ్యవహరించే విషయం.. రాజీవ్ నాయకత్వంపై ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది.
భారత జట్టుకు ప్రధాన ప్రయోజక కర్తగా డ్రీమ్ 11 నిన్నటి వరకు ఉండేది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆస్థానం నుంచి ఆ సంస్థ తప్పుకుంది. ఇప్పుడు మరో సంస్థ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఏర్పడింది. నిబంధనల ప్రకారం 70 సంవత్సరాలు దాటిన వ్యక్తి భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా ఉండడానికి అవకాశం లేదు. రోజర్ బిన్నీ వయసు 70 సంవత్సరాలు దాటిపోయిన నేపథ్యంలో ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. మరికొద్ది రోజుల్లో ఆసియా కప్ మొదలుకాబోతోంది. ఈలోగా భారత్ క్రికెట్ జట్టుకు కొత్త ప్రధాన ప్రయోజక కర్తను ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది.. అయితే ఆసియా కప్ వరకే తాత్కాలిక ప్రధాన ప్రయోజక కర్తను ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందువల్లే అపెక్స్ కౌన్సిల్లో ఈ విషయాల గురించి ప్రధానంగా చర్చ సాగిస్తారని తెలుస్తోంది.
చర్చల అనంతరం ప్రధాన ప్రయోజక కర్త ఎవరనేది తేలుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి బాధ్యులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు రోజర్ బిన్నీ రాజీనామా విషయంలో రాష్ట్రానికి సంబంధించిన క్రికెట్ సంఘాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. బిన్నీ 2022లో భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.. మరో వైపు భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక సర్వ సమావేశం.. ఎన్నికల నిర్వహణలో చేపట్టాల్సిన విధానాలపై వచ్చే నెలలో మీటింగ్ నిర్వహించాల్సి ఉంది. జాతీయ స్పోర్ట్స్ పాలసీ అమల్లోకి అధికారికంగా రావడానికి ఇంకా కాస్త సమయం పట్టొచ్చు. అయితే అప్పటివరకు ఎన్నికలను వాయిదా వేయడం వీలు కాదని తెలుస్తోంది. సర్వోన్నత న్యాయస్థానం నియమించిన కమిటీ సిఫారసుల మేరకే ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి తన విధానాలు కొనసాగిస్తుంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి, రాష్ట్రాలకు సంబంధించిన క్రికెట్ సంఘాలు పనిచేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.