Choreographer Bosco Martis: గత ఏడాది భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో ఒకటి ‘దేవర'(Devara Movie). #RRR వంటి గ్లోబల్ సెన్సేషన్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) నుండి విడుదలయ్యే సినిమా కావడం తో ఈ సినిమాపై అంచనాలు అప్పట్లో విడుదలకు ముందు తారాస్థాయిలో ఉండేవి. ఆ అంచనాలకు తోడు అనిరుద్ అందించిన అద్భుతమైన సంగీతం కూడా ఈ చిత్రం పై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ‘చుట్టమల్లే'(Chuttamalle Song) పాట ఒక ప్రభంజనమే సృష్టించింది. మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో పాటకు వచ్చినంత రెస్పాన్స్, పుష్ప చిత్రం లోని పాటలకు కూడా రాలేదు. జియో సావన్, స్పాటిఫై వంటి మ్యూజిక్ యాప్స్ లో ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్ లోనే ఉందంటే ఈ పాట రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అనిరుద్(Anirudh Ravichander) అందించిన అద్భుతమైన ట్యూన్ తో పాటు, శిల్పా రావు గాత్రం, రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ పాటని ఎక్కడికో తీసుకెళ్లింది.
Also Read: టీఆర్పీ రేటింగ్స్ : బ్రహ్మముడి అధ: పాతాళానికి.. వంటలక్క టాప్ లోకి
ఒక విధంగా గత ఏడాది ‘దేవర’ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్స్ రావడానికి ఈ పాట ఒక ప్రధాన కారణం అయ్యింది. అయితే పాట ఎంత బాగున్నప్పటికీ వెండితెర పై అద్భుతంగా ఆవిష్కరించే కొరియోగ్రాఫర్ లేకపోతే, అసలు ఆ పాటకు ఎలాంటి విలువ ఉండదు. ఇంతటి భారీ లాంగ్ రన్ రెస్పాన్స్ అయితే అసలు ఉండదు. మనిషికి గుండె ఎంత ముఖ్యమో, పాటకు కొరియోగ్రాఫహర్ కూడా అంతే ముఖ్యం. ఈ పాటకు బోస్కో మార్టిస్(Bosco Martis) కొరియోగ్రఫీ అందించాడు. అయితే ఈ పాట కి క్రెడిట్స్ తనకు ఇవ్వలేదని, అసలు నేను ఉన్నాను అనే విషయాన్ని కూడా ఎవ్వరూ గుర్తించలేదని బోస్కో మార్టిస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కూడా ఆయన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.
ఆయన మాట్లాడుతూ ‘ ఏదైనా ఒక సూపర్ హిట్ పాట విడుదలైన తర్వాత మా లాంటి కొరియోగ్రాఫర్స్ ని మేకర్స్ మర్చిపోతూ ఉంటారు. మేము పడిన కష్టానికి ఇతరులకు క్రెడిట్ ఇస్తారు. కాస్త బ్రాండ్ ఇమేజ్ ఉన్న కొరియోగ్రాఫర్స్ పేర్లను లిరికల్ వీడియో సాంగ్ పై చూస్తుంటాము. కానీ మా లాంటి కొత్త కొరియోగ్రాఫర్స్ కి అసలు క్రెడిట్ ఇవ్వరు. కేవలం ఆ పాటలో ఉన్న స్టార్ హీరోలకు మాత్రమే క్రెడిట్ ఇస్తారు. ఇంకెంత కాలం ఈ దోపిడీ. ఒక స్టార్ హీరోకి పాట ద్వారా ఎంత మంచి పేరు వస్తుందో, కొరియోగ్రాఫ్టర్ కి కూడా అంతే మంచి పేరు రావాలి. అదే విధంగా సంగీత దర్శకుడికి వచ్చే పేరు, పాట పాడిన సింగర్ కి కూడా కచ్చితంగా రావాలి. భవిష్యత్తులో వచ్చే నా లాంటి కొత్త తరం కొరియోగ్రాఫర్స్ కి అయినా నాకు పట్టిన గతి పట్టకూడదని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు బోస్కో.
