Virat Kohli: టీమిండియాలో విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి చెప్పాలంటే ఉపోద్ఘాతం సరిపోదు. అతడి గురించి పేజీల పేజీలు రాయచ్చు. గంటకు గంటలు వీడియోలు చేయవచ్చు. అయినప్పటికీ అతడి ఔన్నత్యం వివరణకు అందదు. ఉపోద్ఘాతానికి పొందదు. దూకుడు, వీరోచితం, హీరోచితం, ఇలా ఎన్ని ఉపమానాలైనా విరాట్ కోహ్లీకి ఆపాదించవచ్చు. ఎందుకంటే అతడు చేసే బ్యాటింగ్ అలా ఉంటుంది కాబట్టి. విరాట్ కోహ్లీ సమకాలీన క్రికెట్లో లెజెండ్. శాంతంగా ఉంటే మంచు పర్వతంలాగా కనిపిస్తాడు. గెలికితే మాత్రం అగ్నిపర్వతంలాగా బద్దలవుతుంటాడు. అందువల్లే అతనితో గెలికి కయ్యం పెట్టుకోవడం కంటే చూస్తూ ఊరుకోవడం బెటర్ అని చాలామంది ప్లేయర్లు భావిస్తుంటారు.
విరాట్ కోహ్లీ క్రికెట్ చరిత్రలో 50 సెంచరీల మైలురాయి అందుకున్నాడు. వాస్తవానికి ఈ ఘనతను సచిన్ కూడా సొంతం చేసుకోలేకపోయాడు. అటువంటిది సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ. మామూలుగా అయితే ఈ రికార్డును బ్రేక్ చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. చాలా ఇన్నింగ్స్ లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ విరాట్ కోహ్లీ సచిన్ మాదిరిగా సంవత్సరాలకు సంవత్సరాల క్రితం ఆడినప్పటికీ.. ఇన్నింగ్స్ లు మాత్రం అంతలా తీసుకోలేదు. పైగా ఈ సెంచరీలలో ఎక్కువ శాతం చేజింగ్ సమయంలోనే చేశాడు. అందువల్లే అతడిని పరాక్రమ ఆటగాడు అని పిలుస్తుంటారు. ముఖ్యంగా 2023లో స్వదేశం వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు విరాట్ కోహ్లీ సూపర్ ఫాం ప్రదర్శించాడు. ముఖ్యంగా సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు మీద ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడు చేసిన సూపర్ సెంచరీ న్యూజిలాండ్ జట్టుపై తిరుగులేని స్కోరును టీమిండియా కు అందించింది.
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వన్ డౌన్ లో వచ్చాడు. ప్రారంభంలో నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత తన మార్క్ ఆట తీరు మొదలుపెట్టాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టాడు. అవసరమైన సందర్భంలో క్విక్ డబుల్ తీశాడు. ఇక చెత్త బంతులను తనకు అలవాటైన రీతిలో బౌండరీల వైపు తరలించాడు. తద్వారా సెంచరీ చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీల మైలురాయి అందుకున్నాడు. గొప్ప గొప్ప ప్లేయర్లు సాధించలేని రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం విరాట్ కోహ్లీ చేసిన ఈ సెంచరీ చరిత్ర పుటల్లో సరికొత్తగా నిలిచిపోయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బీసీసీఐ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది.. పరుగుల వీరుడు.. పరాక్రమవంతుడు సరిగ్గా 2023 నవంబర్ 15న ఏం చేశాడో మీకు తెలుసా? అని ఒక ప్రశ్న సంధించి.. అతడు సాధించిన విజయాన్ని గణాంకాల రూపంలో పోస్ట్ చేసింది. 113 బంతుల్లో 117 పరుగులు చేశాడు. 50 సెంచరీల మార్కు అందుకున్నాడు అంటూ బీసీసీఐ ఆ సందర్భాన్ని అభిమానులకు మరోసారి గుర్తు చేసింది. దీంతో విరాట్ సాధించిన రికార్డును అభిమానులు గొప్పగా చెబుతున్నారు. మరోవైపు ఆ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా ఓడిపోయింది. ఆ సందర్భం గుర్తుకొస్తే అభిమానులు ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు.
1⃣1⃣7⃣ Runs
1⃣1⃣3⃣ Deliveries
New Zealand️ #OnThisDay in 2023, former #TeamIndia captain @imVkohli became the first player to register 5⃣0⃣ ODI centuries pic.twitter.com/9F50pGsg8G
— BCCI (@BCCI) November 15, 2025