BCCI Olympic support : నీరజ్ చోప్రా.. మను భాకర్ ఇటీవల పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటారు. ఆశలు లేని చోట పతకాల పంట పండించారు. తద్వారా విశ్వవేదిక మీద భారత దేశం పరువు కాపాడారు. వాస్తవానికి ఈ స్థాయిలో మెడల్స్ సాధించడం మన దేశ స్థాయికి తక్కువే అయినప్పటికీ.. క్రీడాకారులకు ప్రోత్సాహం ఉంటే వారు ఏదైనా చేయగలరు. కానీ ఆ దిశగా అడుగులు పడకపోవడం.. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు ఏ మూలకు సరిపోకపోవడంతో క్రీడాకారులకు ఆశించినంత స్థాయిలో శిక్షణ లభించడం లేదు. అందువల్లే వారు విశ్వవేదికల మీద ఊహించినంత స్థాయిలో సత్తా చాటాలేకపోతున్నారు. జనాభా విషయంలో మనకంటే తక్కువ సంఖ్యలో ఉన్న చైనా, అమెరికా మెడల్స్ విషయంలో ఒకటి, రెండు స్థానాల కోసం పోటీ పడుతుంటే.. మన దేశం మాత్రం ఎక్కడో దిగువన ఉండటం సగటు భారతీయుడిని ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read : విరాట్ అందుకే రిటైర్ అయ్యాడు.. అసలు కారణం చెప్పిన రవిశాస్త్రి
చేయూత అందించే దిశగా..
విశ్వ వేదికల పైన జరిగే క్రీడలలో.. ముఖ్యంగా ఒలంపిక్స్ లాంటి పోటీలలో భారత క్రీడాకారులు సత్తా చాటేందుకు అనువైన వాతావరణం కల్పించాలని.. ప్రపంచ స్థాయిలో శిక్షణ ఇవ్వాలనే తలంపు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ.. అది ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చే అవకాశం కల్పిస్తోంది.
అతిపెద్ద శిక్షణ కేంద్రం
ఒలంపిక్ క్రీడలలో పాల్గొనే క్రీడాకారులకు అతిపెద్ద శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి.. అత్యున్నత స్థాయిలో సౌకర్యాలు కల్పించడానికి అడుగులు పడుతున్నాయి. కేంద్ర క్రీడా శాఖ చేపట్టే ఈ బృహత్తర ప్రయత్నంలో బీసీసీఐ కూడా తనవంతు పాత్ర పోషించబోతోంది. ఈ క్రతువులో అనేక కార్పొరేట్ సంస్థలు కూడా తమ వంతు పాత్ర పోషించబోతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సూక్ మాండవీయా ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.. 58 సంవత్సరాల కు చెందిన కార్పొరేటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఇందులో బీసీసీఐ కీలక ప్రతిపాదన చేసింది. మూడు ఒలంపిక్ క్రీడలను దత్తత తీసుకొని.. ఆ క్రీడాకారులకు అద్భుతమైన శిక్షణ ఇస్తామని తన అంగీకారాన్ని తెలిపింది. ఇక మిగతా కార్పొరేట్ సంస్థలు కూడా అదే బాటలో కొనసాగుతామని మాట ఇచ్చాయి.. అంతేకాదు ప్రతి క్రీడకు ప్రత్యేకంగా అత్యున్నత స్థాయిలో భారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. సుమారు 100 నుంచి 200 మంది క్రీడాకారులను ఎంపిక చేసుకొని ప్రపంచ స్థాయిలో శిక్షణ ఇస్తారు.. ఇక ప్రస్తుతం మన దేశంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 23 నేషనల్ గేమ్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో క్రీడకు సంబంధించి ప్రత్యేకంగా ఉన్న కేంద్రాలు మూడు మాత్రమే. ఢిల్లీలో ఈత, షూటింగ్, రోహతక్ లో బాక్సింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే ప్రతి గేమ్ కు ప్రత్యేకంగా స్పోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర క్రీడా శాఖ చెబితే.. దానికి బీసీసీఐ.. ఇతర కార్పొరేట్ సంస్థలు తమ సమ్మతం తెలిపాయి. బీసీసీఐ ఒలంపిక్స్, ప్లేయర్ల కోసం భారీగా విరాళం ఇచ్చింది. 2008లో నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ కోసం 50 కోట్లు ఇచ్చింది. పారిస్ ఒలంపిక్స్ కు ముందు ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ కు 8.5 కోట్లు ఇచ్చింది. ఇక ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించిన ప్లేయర్లకు ప్రైజ్ మనీతో పాటు.. సన్మానం కూడా చేసింది.