BCCI shock to Rohit Virat: సుదీర్ఘకాలంగా టీం ఇండియాలో ఆడుతున్నప్పటికీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పైగా వారు వైట్ బాల్ ఫార్మేట్ లోనే ఆడుతున్నారు. టి20, టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. వన్డే ఫార్మేట్లో ఆడుతున్న వారిద్దరు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో విరాట్ కోహ్లీ పరుగుల మోత మోగించాడు. రోహిత్ అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ… అతడి మీద మేనేజ్మెంట్ కు గట్టి నమ్మకం ఉంది.
వీరిద్దరూ వచ్చే వరల్డ్ కప్ లో ప్రాతినిధ్యం వహించేందుకు తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగానే వన్డే క్రికెట్ ఆడుతున్నారు. తమ సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకుంటున్నారు. రోహిత్ శర్మ అయితే ఏకంగా తన బరువును పూర్తిగా తగ్గించుకున్నాడు. పూర్తి స్లిమ్ గా కనిపిస్తూ అదరగొడుతున్నాడు. అయితే విరాట్, రోహిత్ శర్మకు భారత క్రికెట్ నియత్రణ మండలి షాక్ ఇచ్చింది. ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ విధానంలో మార్పులు తీసుకురావాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ ప్రకారం ఏ ప్లస్ కేటగిరీని తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఏ, బీ, సీ కేటగిరిలు మాత్రమే ఉంటాయని బిసిసిఐ వర్గాలు చెప్పినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై తదుపరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఏ ప్లస్ కేటగిరిలో ఉన్నారు. మీరు బి కేటగిరిలో కి వెళ్తారు. ఎందుకంటే వీరిద్దరూ వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న కేటగిరీల ప్రకారం చూసుకుంటే ఏ ప్లస్ కేటగిరి లో ఉన్న ఆటగాళ్లకు ఏడు కోట్లు, ఏ, బీ, సీ కేటగిరిలో ఉన్న ప్లేయర్లకు వరుసగా ఐదు కోట్లు, మూడు కోట్లు, కోటి రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. బీసీసీఐ ఏ ప్లస్ కేటగిరి ఎత్తేస్తే.. వార్షిక ఫీజులో మార్పు వస్తుందని తెలుస్తోంది.
బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. ఏ ప్లస్ కేటగిరీలో కొంతమంది ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. అయితే జట్టులో ఏకీకృత విధానాన్ని తీసుకురావాలని మేనేజ్మెంట్ భావిస్తున్న నేపథ్యంలో.. ఏ ప్లస్ కేటగిరిని ఎత్తివేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వర్ధమాన క్రీడాకారులను బి లేదా సీ కేటగిరిలోకి తీసుకురావాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. ప్లేయర్ల కేటగిరిలు.. వారికి సంబంధించిన ఫీజు విషయాలు త్వరలోనే ఆఫీస్ కౌన్సిల్ మీటింగ్లో తేలుతాయని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ విరాట్ కోహ్లీ, రోహిత్ కేటగిరీలను మార్చడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై బిసిసిఐ పెద్దలు ఎలాంటి సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.
