https://oktelugu.com/

Pooja Hegde: కారులో బాయ్ ఫ్రెండ్ తో పూజ హెగ్డే… అడ్డంగా బుక్ అయిన బుట్టబొమ్మ!

పూజ హెగ్డే నటించిన ఆచార్య మరొక డిజాస్టర్. చిరంజీవి, రామ్ చరణ్ కెరీర్లోనే అతిపెద్ద ప్లాప్ గా నిలిచింది. అలాగే విజయ్ తో చేసిన బీస్ట్, రణ్వీర్ సింగ్ కి జంటగా నటించిన సర్కస్...

Written By:
  • S Reddy
  • , Updated On : April 1, 2024 / 10:16 AM IST

    Pooja Hegde spotted with boyfriend Rohan Mehra

    Follow us on

    Pooja Hegde: పూజ హెగ్డే మొదటిసారి బాయ్ ఫ్రెండ్ తో దర్శనం ఇచ్చింది. నైట్ వీకెండ్ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఈ జంట కెమెరా కంటికి చిక్కారు. బుట్టబొమ్మ బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పూజ హెగ్డే చేతిలో చిత్రాలు లేవు. ఆమెకు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. 2021 వరకు ఆమె కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగింది. వరుస విజయాలతో టాలీవుడ్ స్టార్ హీరోల ఛాయిస్ అయ్యింది. అయితే రాధే శ్యామ్ తో ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ కి జంటగా నటించిన ఈ పాన్ ఇండియా మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

    అనంతరం పూజ హెగ్డే నటించిన ఆచార్య మరొక డిజాస్టర్. చిరంజీవి, రామ్ చరణ్ కెరీర్లోనే అతిపెద్ద ప్లాప్ గా నిలిచింది. అలాగే విజయ్ తో చేసిన బీస్ట్, రణ్వీర్ సింగ్ కి జంటగా నటించిన సర్కస్, సల్మాన్ ఖాన్ తో జతకట్టిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. గోల్డెన్ లెగ్ ఇమేజ్ నుండి ఐరన్ లెగ్ ఇమేజ్ కి ఆమె పడిపోయింది. సినిమాలు లేక ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది.

    సాయి ధరమ్ తేజ్ కి జంటగా ఓ సినిమాకు సైన్ చేసిందనే ఊహాగానాలు ఉన్నాయి. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న గంజా శంకర్ లో పూజ హెగ్డే హీరోయిన్ అంటున్నారు. అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమాలు లేని పూజ హెగ్డే బాయ్ ఫ్రెండ్ తో ఆహ్లాదంగా గడుపుతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఆదివారం ముంబైలో ఓ వ్యక్తితో పూజ హెగ్డే కనిపించింది. కారులో ఒక యువకుడి పక్కన పూజ హెగ్డే కూర్చుని ఉంది.

    అతడి పేరు రోహన్ మెహ్రా అని సమాచారం. అతడే పూజ హెగ్డే బాయ్ ఫ్రెండ్ అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి దీనిపై స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది. పూజ హెగ్డే పై గతంలో కొన్ని ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. సల్మాన్ ఖాన్ తో ఆమె ఎఫైర్ పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ పుకార్లను సల్మాన్ టీమ్ ఖండించింది. అలాగే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో కూడా ఆమెకు ఎఫైర్ ఉందనే వాదన ఉంది. ఏది ఏమైనా పూజ హెగ్డే బాయ్ ఫ్రెండ్ ఇతడే అంటూ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.