https://oktelugu.com/

BCCI Central Contracts: వారి పేర్లు మాయం.. గుజరాత్ ఆటగాడికి స్థానం.. రోహిత్ స్కెచ్ వేశాడా?

అయ్యర్, కిషన్ పేర్లు మాయం కావడం వెనుక భారత కెప్టెన్ రోహిత్ శర్మ హస్తం ఉందని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా కొంతమంది అభిమానులు రోహిత్ శర్మ పాత్ర పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 29, 2024 / 12:18 PM IST
    Follow us on

    BCCI Central Contracts: బీసీసీఐ 2023-2024 సంవత్సరానికి సంబంధించి బుధవారం ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు వివాదానికి కారణమవుతోంది. ఈ సెంట్రల్ కాంట్రాక్టులో సీనియర్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తమ స్థానాలను కోల్పోయారు. కొంతకాలంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు రంజీ మ్యాచులలో ఆడటం లేదు. కేవలం టి20 లో ఆడేందుకు మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. టెస్ట్ సిరీస్ లకు ఎంపిక చేస్తే పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. వీరి వల్ల మిగతా ఆటగాళ్లకు చోటు ఇవ్వడం బీసీసీఐకి కుదరడం లేదు. ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టులో వారి పేర్లు మాయమయ్యాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

    అయ్యర్, కిషన్ పేర్లు మాయం కావడం వెనుక భారత కెప్టెన్ రోహిత్ శర్మ హస్తం ఉందని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా కొంతమంది అభిమానులు రోహిత్ శర్మ పాత్ర పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.” వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుతో భారత్ ఓడిపోయింది. అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లోకి నరేంద్ర మోడీ వచ్చారు. అప్పుడు అయ్యర్ కొంత నిరుత్సాహంగా కనిపించాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఈ కారణంతోనే అయ్యర్ కాంట్రాక్టు తొలగించారని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

    కిషన్ కాంట్రాక్ట్ తొలగించడం వెనుక రోహిత్ పాత్ర ఉందని మరికొందరు విమర్శిస్తున్నారు. “ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కు కిషన్ సన్నిహితంగా ఉంటాడు. అతడు అలా ఉండడాన్ని రోహిత్ సహించలేకపోతున్నాడు. దీంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో కిషన్ పేరు లేకుండా చేశాడు. అతడికి తీరని అన్యాయం చేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడనంతమాత్రాన సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఎలా తొలగిస్తారు? ఏడాది నుంచి భారత జట్టుతో ఉంటూ కీలక ఇన్నింగ్స్ లు ఆడిన కిషన్, అయ్యర్ ను కాంట్రాక్టర్ నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసం? వన్డే ప్రపంచ కప్ లో హైయర్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 66.25 సగటుతో 530 పరుగులు చేశాడని” నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

    మరోవైపు ఓ గుజరాత్ ఆటగాడు ఐదు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ.. ప్రపంచ కప్ లో మధ్యలోనే వెనుతిరిగి వచ్చినప్పటికీ.. అతడికి సెంట్రల్ కాంట్రాక్టులో స్థానం కల్పించారని.. అతడికి ఏ గ్రేడ్ ఇచ్చారని కొంతమంది అభిమానులు మండిపడుతున్నారు. గుజరాత్ ఆటగాళ్లకు ఒక న్యాయం, మిగతా ఆటగాళ్లకు ఒక న్యాయమా అంటూ నిలదీస్తున్నారు. తనకు అనుకూలంగా ఉన్న ఆటగాళ్లకు మాత్రమే సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కేలా చేశాడని రోహిత్ శర్మ పై మండిపడుతున్నారు.