BCCI
BCCI: టి20 మోజులో పడి ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ ఆడటం లేదు. కనీసం రంజీ మ్యాచ్ లు కూడా ఆడటం లేదు. అందువల్లే కదా ఇటీవల అయ్యర్, కిషన్ బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయింది. అయితే చర్య ద్వారా టెస్ట్ క్రికెట్ ఆడని ఆటగాళ్లు ఎంతటి వారైనా తమ బదులు ఇలానే ఉంటుందని బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది. అయితే తాజాగా ఇంగ్లాండ్ జట్టుపై భారత జట్టు 4-1 తేడాతో టెస్ట్ సిరీస్ గెలిచిన నేపథ్యంలో.. బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా దానిని ప్రకటించారు..
ఆటగాళ్ల కోసం.
ఇప్పటికే ఆటగాళ్ల కోసం స్పెషల్ కాంట్రాక్ట్ ప్రకటించిన బీసీసీఐ.. టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీం ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ” ఇది మా గౌరవనీయమైన ఆటగాళ్లకు ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని అందిస్తుంది. దీనికోసం బీసీసీఐ ఒక కీలక అడుగు వేసింది. 2022-23 సీజన్ నుంచి టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీం ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ లపై బీసీసీఐ చెల్లిస్తున్న ఫీజు కు ఇది అదనంగా ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్సెంటివ్ కనీస ఫీజును 15 లక్షలు గా నిర్ణయించామని” జై షా ట్విట్టర్లో ప్రకటించారు. ఒక సీజన్లో 4 టెస్టుల కంటే తక్కువ ఆడే వాళ్లకు ఈ ఇన్సెంటివ్ స్కీం వర్తించదు.. అది ఆటగాళ్లకైనా, రిజర్వ్ బెంచ్ వాళ్లకైనా ఇదే తీరుగా ఉంటుంది. 5 లేదా 6 టెస్టులు ఆడే ఆటగాళ్లకు.. ఒక్కో మ్యాచ్ కు 30 లక్షలు చెల్లిస్తారు. రిజర్వ్ బెంచ్ కు పరిమితమైన ఆటగాళ్లకు 15 లక్షలు చెల్లిస్తారు. ఏడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడితే ఒక్కో మ్యాచ్ పై 45 లక్షలు చెల్లిస్తారు. రిజర్వ్ బెంచ్ కు పరిమితమైన ఆటగాళ్లకు 22.5 లక్షలు చెల్లిస్తారు. ఈ ఇంటెన్సివ్ స్కీం కనీస ఫీజును బీసీసీఐ 15 లక్షలు గా నిర్ణయించింది.
టెస్ట్ క్రికెట్ కోసం..
అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ తెరపైకి తీసుకురావడం పట్ల మాజీ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ సరైన సమయంలో ప్రకటించిందని వారు చెబుతున్నారు. టి20 వల్ల టెస్ట్ క్రికెట్ మనుగడ కోల్పోతోందని.. ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఇష్టం చూపించడం లేదని.. అలాంటప్పుడు బాధ్యతాయుతమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని మాజీ క్రీడాకారులు అంటున్నారు. ఇలాంటి నిర్ణయం ముందే తీసుకొని ఉండి ఉంటే ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ వైపు మొగ్గు చూపించేవారని వారు గుర్తు చేస్తున్నారు. కాగా, జై షా ట్వీట్ చేసిన అనంతరం.. దానిని బీసీసీఐ రీ ట్వీట్ చేసింది.
I am pleased to announce the initiation of the ‘Test Cricket Incentive Scheme’ for Senior Men, a step aimed at providing financial growth and stability to our esteemed athletes. Commencing from the 2022-23 season, the ‘Test Cricket Incentive Scheme’ will serve as an additional… pic.twitter.com/Rf86sAnmuk
— Jay Shah (@JayShah) March 9, 2024
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Bcci announces salary hike for test players up to rs 45 lakh launched a new reward scheme
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com