Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024 : శ్రీకాకుళం టు అనంతపురం.. గెలుపు ఎవరిదంటే? సంచలన సర్వే

AP Elections 2024 : శ్రీకాకుళం టు అనంతపురం.. గెలుపు ఎవరిదంటే? సంచలన సర్వే

AP Elections 2024 : ఎన్నికల ముంగిట ఆసక్తికర సర్వేలు వెల్లడవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో అందరి దృష్టి మన రాష్ట్రం పైన పడింది. దీంతో అటు జాతీయస్థాయిలో పార్లమెంట్ స్థానాలతో పాటు ఏపీలో అసెంబ్లీ స్థానాలపై జాతీయ సర్వే సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ చేపట్టిన లేటెస్ట్ సర్వేను విడుదల చేసింది.

ఫిబ్రవరి 15 నుంచి 29 తేదీల మధ్య ఈ సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సర్వే చేపట్టామని, 53,000 మంది అభిప్రాయాలను సేకరించినట్లు వెల్లడించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 54 శాతం మంది పురుషులు, 46% మంది మహిళలు ఉన్నట్లు వివరించింది. జిల్లాల వారీగా ఫలితాలను వెల్లడించింది. టిడిపి జనసేన కూటమి 51.4% ఓట్లతో 104 స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. 42.6% ఓట్లతో వైసిపి 49 సీట్లకే పరిమితం కానుందని తేల్చి చెప్పింది. 22 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉంటుందని విశ్లేషించింది. ఎంపీ స్థానాలకు సంబంధించి కూటమి 18 స్థానాలను కైవసం చేసుకుంటుందని.. వైసీపీకి కేవలం ఏడు స్థానాలు వస్తాయని పేర్కొంది.

అటు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సైతం ఫలితాలను వెల్లడించింది. శ్రీకాకుళం లోక్ సభ స్థానానికి సంబంధించి శ్రీకాకుళం, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం ఆమదాలవలసలో టిడిపి, జనసేన కూటమి విజయం సాధిస్తుందని తేల్చి చెప్పింది. పలాసలో వైసిపి గెలుపొందుతుందని.. నరసన్నపేటలో హోరాహోరీ ఫైట్ ఉంటుందని సర్వే స్పష్టం చేసింది.

విజయనగరం లోక్ సభ స్థానానికి సంబంధించి ఎచ్చెర్ల, బొబ్బిలి, విజయనగరంలో టిడిపి,జనసేన, చీపురుపల్లి, గజపతినగరంలో వైఎస్ఆర్సిపి గెలుపొందే ఛాన్స్ ఉంది. రాజాం, నెల్లిమర్లలో గట్టి ఫైట్ ఉంటుంది.

అరకు పార్లమెంట్ స్థానం పరిధిలో దాదాపు అన్ని నియోజకవర్గాలు వైసిపి గెలుచుకునే ఛాన్స్ ఉంది. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం లో వైసీపీ గెలుపొందుతుంది. అరకులోయ కూటమి గెలుపు ఛాన్స్ ఉంది. పాడేరులో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది.

విశాఖపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలో అన్ని స్థానాలను టిడిపి, జనసేన కూటమి గెలుచుకోనుంది. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు గాజువాక, భీమిలి, ఎస్ కోటలో టిడిపి, జనసేన కూటమి అభ్యర్థులు గెలవనున్నారు.

అనకాపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో చోడవరం, అనకాపల్లి పెందుర్తి, ఎలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గాల పరిధిలో టిడిపి,జనసేన కూటమి అభ్యర్థులు గెలవనున్నారు. మాడుగులలో వైసిపి గెలవనుంది. పాయకరావుపేట లో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది.

కాకినాడ పార్లమెంట్ స్థానం పరిధిలో పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేటలో టిడిపి, జనసేన కూటమి గెలవనుంది. తునిలో వైసిపి గెలిచే ఛాన్స్ ఉంది. ప్రత్తిపాడు లో గట్టి ఫైట్ ఉంటుంది.

రాజమండ్రి పార్లమెంట్ స్థానం పరిధిలో రాజానగరం,రాజమండ్రిసిటీ, రాజమండ్రి రూరల్, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన కూటమి విజయం సాధిస్తుంది. అనపర్తి లో మాత్రం వైసిపి గెలిచే ఛాన్స్ ఉంది. కొవ్వూరులో ఫైట్ ఉంటుంది.

అమలాపురం నియోజకవర్గంలో దాదాపు అన్ని స్థానాలు టిడిపి, జనసేన కూటమి విజయం సాధించే అవకాశం ఉంది. రామచంద్రపురం లో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది. ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, మండపేటలో కూటమి అభ్యర్థులు ఏకపక్ష విజయాన్ని దక్కించుకోనున్నారు.

నరసాపురం లోక్సభ స్థానం పరిధిలో అచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తనుకు, తాడేపల్లిగూడెంలో ఓటమి అభ్యర్థులు విజయం సాధించనున్నారు.

ఏలూరు పార్లమెంట్ స్థానం పరిధిలోని ఉంగటూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి, కైకలూరులో కూటమి అభ్యర్థులు గెలవనున్నారు. ఏలూరు, నూజివీడులో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది.

విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలోని.. మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ పశ్చిమ, తూర్పు, సెంట్రల్నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు.. తిరువూరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు.

మచిలీపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలో గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనమలూరులో కూటమి అభ్యర్థులు.. గుడివాడలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించుకున్నారు. పామర్రు లో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది.

గుంటూరు పార్లమెంట్ స్థానం పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూటమి కైవసంకానున్నాయి. తాడికొండ మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందనున్నారు.

నరసరావుపేట నియోజకవర్గంలో పెదకూరపాడు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండలో కూటమి అభ్యర్థులు గెలుపొందనున్నారు. నరసరావుపేట, గురజాల, మాచర్లలో గట్టి ఫైట్ ఉంటుంది.

బాపట్ల పార్లమెంట్ స్థానం పరిధిలో వేమూరు, రేపల్లె, పర్చూరు, అద్దంకి, చీరాలలో కూటమి అభ్యర్థులు విజయం సాధించనున్నారు. బాపట్లలో వైసీపీ విజయం ఖాయం. సంతనూతలపాడు లో గట్టి ఫైట్ ఉంటుంది.

ఒంగోలు పార్లమెంట్ స్థానం పరిధిలో దర్శి, ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరిలో ఓటమి అభ్యర్థులు, ఎర్రగొండపాలెం లో గట్టి ఫైట్ ఉంటుంది.

నెల్లూరు పార్లమెంట్ స్థానం పరిధిలో కావలి, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ లో ఓటమి అభ్యర్థులు, కందుకూరు, ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. కోవూరులో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది.

తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలో సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సత్యవేడులో వైసీపీ విజయం సాధిస్తుంది. తిరుపతి, శ్రీ కాళహస్తి మాత్రం కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు.

చిత్తూరు పార్లమెంట్ స్థానం పరిధిలో చంద్రగిరి, జీడీ నెల్లూరు, పూతలపట్టులో వైసిపి.. నగరి, కుప్పం, పనమలేరులో కూటమి అభ్యర్థులు గెలుపొందుతారు. చిత్తూరులో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది.

రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలో రాజంపేట,కోడూరు, రాయచోటి, మదనపల్లి, పుంగనూరులో వైసిపి.. తంబళ్లపల్లె, పీలేరులో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు.

కడప పార్లమెంట్ స్థానానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించనుంది. బద్వేలు కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరులో వైసిపి అభ్యర్థులే విజయం సాధిస్తారు.

నంద్యాలలో ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం,బనగానపల్లె, డోన్లలో వైసిపి అభ్యర్థులు విజయం సాధిస్తారు. నంద్యాలలో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది.

కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో పత్తికొండ,కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని,ఆలూరులో వైసీపీ విజయం సాధిస్తుంది. మంత్రాలయంలో మాత్రం కూటమి అభ్యర్థి గెలుపు ఖాయం.

అనంతపూర్ నియోజకవర్గంలో రాయదుర్గం,ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం, కళ్యాణదుర్గంలో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. సింగనమలలో మాత్రం వైసిపి విజయం సాధిస్తుంది.

హిందూపురం పార్లమెంట్ స్థానం పరిధిలో రాప్తాడు, హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, కదిరిలో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. మడకశిరను మాత్రం వైసిపి కైవసం చేసుకుంటుంది. పుట్టపర్తి లో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular