ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించి ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన భారత్ ఇప్పుడు స్వదేశంలో బలమైన ఇంగ్లండ్ జట్టును ఢీకొంటోంది. నాలుగు టెస్టుల సిరీస్ కు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ లకు భారత సెలెక్షన్ కమిటీ మంగళవారం జంబో జట్టు ప్రకటించింది.
Also Read: అసీస్ కు గర్వభంగం.. భారత్ చేసిన అద్భుతం
పెటర్నిటీ లీవ్ తో జట్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. కోహ్లీతోపాటు ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, ఇషాంత్ శర్మలకు అవకాశం దక్కింది.
ఆస్ట్రేలియా పర్యటనలో అసాధారణ ప్రదర్శన కనబరిచిన వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ లకు చోటు దక్కింది. నటరాజన్, నవ్ దీప్ సైనీలకు మాత్రం నిరాశ ఎదురైంది.
ఇక పేలవ ఆటతీరుతో దారుణంగా విఫలమైన ఫృథ్వీషాపై వేటు పడింది. గాయాలతో తప్పుకున్న షమీ, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, హనుమ విహారిలకు కూడా చోటు దక్కలేదు.
Also Read: వైరల్ వీడియో: డ్రెస్సింగ్ రూంలో టీమిండియా కోచ్ మాటలు
కొత్తగా అక్షర్ పటేల్ కు పిలుపు రాగా.. తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ కు స్టాండ్ బై ఆటగాళ్లుగా అవకాశం దక్కింది.
ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు తొలి టెస్టు, ఫిబ్రవరి 13-17 వరకు రెండో టెస్టు చైన్నైలో జరుగనుంది.
* భారత జట్టు ఇదే..
కోహ్లీ(కెప్టెన్), రోహిత్, గిల్, మయాంక్, పూజారా, అజింక్యా రహానే, రిషబ్ పంత్, సాహా, పాండ్యా, కేఎల్ రాహుల్, బూమ్రా, ఇషాంత్, సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, అశ్విన్, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్