Bangalore : పంత్ బృందం నిర్దేశించిన 227 రన్స్ టార్గెట్ ను బెంగళూరు 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి చేదించింది. తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ (84*), మాయాంక్ అగర్వాల్ (41*), విరాట్ కోహ్లీ(54), సాల్ట్ (30) అదరగొట్టారు. వీరందరి దూకుడుతో బెంగళూరు జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జితేష్ శర్మ నిలిచాడు. ఇక ఈ విజయం ద్వారా టాప్ -2 లోకి వెళ్లడమే కాదు జితేష్ సేన అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇంతకీ అవి ఏంటంటే
2011, 2016 లో బెంగళూరు రన్నరప్ గా నిలిచిన తర్వాత లీగ్ దశలో టాప్ -2 లో స్థానం సంపాదించడం ఇది మూడవసారి.
2021లో వాంఖడే రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ మధ్య 210 (కేఎల్ రాహుల్ 91, సంజు 119) తర్వాత క్రికెట్ కీపర్లు ఐపీఎల్ మ్యాచ్లో 200+ పరుగులు చేయడం ఇది రెండవసారి..
లక్ష్య చేదనలో ఆరు లేదా అంతకంటే తక్కువ వికెట్ నుంచి అత్యధిక పరుగులు నమోదు చేసిన జాబితాలో జితేష్ శర్మ చేరాడు..
సంజీవ్ గోయంక అధిపతిగా ఉన్న జట్టుతో ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లో బెంగళూరు తరఫున జితేష్ 33 బంతులు ఎదుర్కొని 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
2018లో బెంగళూరు వేదికగా బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు ధోని 34 బంతులు ఎదుర్కొని 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
2022లో ముంబై వేదికగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా ఆటగాడు అండ్రి రస్సెల్ 31 బంతులు ఎదుర్కొని 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
2017లో ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరాన్ పొలార్డ్ 47 బంతుల్లో 70 పరుగులు చేశాడు. బెంగళూరు వేదికగా బెంగళూరు జట్టుతో జరిగిన ఈ మ్యాచ్లో అతడు ఈ ఘనత సాధించాడు.
2018లో ముంబై ఇండియన్స్ పై ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు బ్రావో 30 బంతుల్లో 68 పరుగులు చేశాడు.
జితేష్, మయాంక్ నెలకొల్పిన 107* పరుగుల భాగస్వామ్యం బెంగళూరు తరఫున ఐదో వికెట్ కు అత్యుత్తమంగా ఉంది.
ఈ భాగస్వామ్యం కంటే ముందు 2016 సీజన్లో క్వాలిఫైయర్ -1 లో గుజరాత్ లయన్స్ పై బెంగళూరు ఆటగాళ్ళు డివిలియర్స్, ఇక్బాల్ అబ్దుల్లా 91* పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..
ఇక ఈ సీజన్లో బెంగళూరు తరఫున ఐదవ స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో ఐదు సార్లు 50+ స్కోర్ల భాగస్వామ్యం నమోదయింది. ఒక ఐపిఎల్ ఎడిషన్లో బెంగళూరు జట్టుకు ఇదే అత్యధికం. 2014లో నాలుగు సార్లు 50+ స్కోర్ లను బెంగళూరు జట్టు నమోదు చేసింది. 2014లో డివిలియర్స్, యువరాజ్ చెరి రెండుసార్లు 50+ కంటే ఎక్కువ పరుగులు సాధించారు. ఇక ఈ సంవత్సరం టీమ్ డేవిడ్, లివింగ్ స్టోన్, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, జితేష్ శర్మ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లుగా నిలిచారు
Also Read : ఎంత ట్రోలింగ్ చేస్తే.. అంత ఆదాయం.. అదే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాజిక్కూ!