World cup T20: ఏంటీ బ్యాక్ లైవ్స్ మ్యాటర్’.. సౌతాఫ్రికా క్రికెట్ లో ఎందుకీ సంక్షోభం?

World cup T20: ప్రపంచకప్ టీ20లో ఇప్పుడు వర్ణ/జాతి వివక్షపై పోరాటం అందరి మనసులు గెలుచుకుంటోంది. అన్ని టీంలు మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో మోకాళ్లపై కూర్చొని చేసే నిరసన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్నే ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (Back Lives Matter) ఉద్యమం అంటారు. ఈ ఉద్యమానికి తాముసైతం అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు అందరూ యూఏఈలో జరుగుతున్న ప్రపంచకప్ టీ20లో మోకాళ్లపై కూర్చొని సంఘీభావం తెలుపుతున్నారు. అసలు ఏంటీ బ్లాక్ లైవ్స్ మ్యాటర్? […]

Written By: NARESH, Updated On : October 28, 2021 3:06 pm
Follow us on

World cup T20: ప్రపంచకప్ టీ20లో ఇప్పుడు వర్ణ/జాతి వివక్షపై పోరాటం అందరి మనసులు గెలుచుకుంటోంది. అన్ని టీంలు మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో మోకాళ్లపై కూర్చొని చేసే నిరసన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్నే ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (Back Lives Matter) ఉద్యమం అంటారు. ఈ ఉద్యమానికి తాముసైతం అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు అందరూ యూఏఈలో జరుగుతున్న ప్రపంచకప్ టీ20లో మోకాళ్లపై కూర్చొని సంఘీభావం తెలుపుతున్నారు. అసలు ఏంటీ బ్లాక్ లైవ్స్ మ్యాటర్? ఎందుకు క్రికెటర్లు ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు? దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆ దేశ క్రికెట్ లో సంక్షోభం ఎందుకొచ్చిందన్నది ఇప్పుడు అందరినీ ఇటువైపు దృష్టి సారించేలా చేసింది.

Back Lives Matter cricket

ప్రపంచకప్ టీ20లో మ్యాచ్ లన్నీ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఇండియా-పాకిస్తాన్ హైఓల్టేజ్ మ్యాచ్ కాకరేపింది. ఇక మిగతా మ్యాచ్ లన్నీ హోరాహోరీగా సాగుతున్నాయి. అయితే వర్ణ/జాతి వివక్షకు కేరాఫ్ అడ్రస్ అయిన దక్షిణాఫ్రికా క్రికెట్ లో ఈ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ నిరసన ఉద్యమం చిచ్చురేపింది. ఆ దేశంలో నల్లజాతీయులు తమకు హక్కులు కావాలని ఎప్పటి నుంచో ఉద్యమిస్తున్నారు. ఆదేశ క్రికెట్ బోర్డు సైతం శ్వేతజాతీయులకు ఐదు స్థానాలే కేటాయించి మిగతా స్థానాలు నల్లజాతీయులకు కేటాయించింది. ప్రస్తుత దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ ‘బవుమా’ కూడా నల్లజాతీయుడే. దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి కెప్టెన్ కూడా.. అయితే ఇందులో ఆడుతున్న ప్రముఖ క్రికెటర్, ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ అయిన డికాక్ ఈ నల్లజాతీయులకు సపోర్టుగా నిలిచే ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ నిరసనను వ్యతిరేకించారు.

దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయులపై నల్లజాతీయులదే ఆధిపత్యం.. పీఎం నుంచి క్రికెట్ కెప్టెన్ వరకూ వాళ్లదే సాగుతోంది. ఒకప్పుడు శ్వేతజాతీయుల దురంహకారాన్ని నిరసించి సౌతాఫ్రికాలో నల్లజాతీయులు ఇప్పుడు హక్కులు సాధించారు. అయితే శ్వేత జాతీయులపై కూడా ఇప్పుడక్కడ ప్రాధాన్యత తగ్గి వివక్షకు గురవుతున్నారు. కెప్టెన్సీ సహా 5 స్థానాలు మాత్రమే శ్వేతజాతీయులకు దక్షిణాఫ్రికా క్రికెట్ లో ఇచ్చారు. దీన్ని డికాక్ నిరసించారు. ఈ కారణంతోనే డుప్లెసిస్, డివిలియర్స్ లాంటి గొప్ప సౌతాఫ్రికా క్రికెటర్లు టీం నుంచి తప్పుకున్నారు.

కాగా తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికా తరుఫున ఆడిన డికాక్ మైదానంలో ‘బ్లాక్ లైవ్ మ్యాటర్స్’ ఉద్యమానికి మద్దతుగా కూర్చొని నిరసన తెలుపలేదు. ఇది వివాదమైంది. అందరూ క్రికెటర్లు తెలిపినా అతడు మాత్రం నిలుచుకొని మౌనంగా ఉన్నాడు. దీంతో దక్షిణాఫ్రికా బోర్డు డికాక్ సహా అందరూ తెలుపాల్సిందేనని ఆదేశించింది.దీంతో సెకండ్ మ్యాచ్ వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో డికాక్ చివరి నిమిషంలో తప్పుకొని షాకిచ్చాడు. డికాక్ లాంటి అంతర్జాతీయ ప్లేయర్ తప్పుకోవడంతో ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిన సౌతాఫ్రికా కుదేలైంది.కానీ వెస్టిండీస్ పై ఎలాగోలా గెలిచింది.

అయితే డికాక్ చర్యను సౌతాఫ్రికా క్రికెట్ జట్టు నల్లజాతి కెప్టెన్ బవుమా సమర్థించారు. ఆటగాళ్ల ఇష్టానికి వదిలేయాలని.. ఈ నిరసనపై బోర్డు ఆదేశాలను తప్పుపట్టారు.ఎవరి మనోభావాలను వారు గౌరవించాలని సూచించారు. దీంతో దక్షిణాఫ్రికా బోర్డు ఆదేశాలపై సొంత జట్టు కెప్టెన్ తప్పుపట్డంతో ఈ దుమారం చెలరేగింది. ఇప్పుడు ఈ ఉద్యమం సౌతాఫ్రికా క్రికెట్ ను చీల్చేలా కనిపిస్తోంది. స్వచ్ఛందంగా చేయాల్సిన ఉద్యమం పక్కదారి పడుతోంది.

-బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం కథ ఇదీ
అమెరికాలో ట్రంప్ హయాంలో ఒక శ్వేతజాతి పోలీస్ నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లయిడ్ మెడ మీద కర్కశంగా కాలితో తొక్కిపట్టి అతడి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు పోయేలా చేశాడు. నల్లజాతీయులపై శ్వేత జాతి పోలీస్ చేసిన ఈ దురంహకారంపై అమెరికా భగ్గుమది. నల్లజాతీయులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం మొదలైంది. దానికి ప్రపంచకప్ టీ20లో ఆటగాళ్లు సంఘీభావం తెలుపుతున్నారు. దీన్ని దక్షిణాఫ్రికా క్రికెటర్ డికాక్ వ్యతిరేకించడంతో ఇప్పుడు వివాదం చెలరేగింది.

goerge floid

Also Read: ఎంఎస్ ధోనిని క్రికెట్ మేధావి అని ఇందుకే అంటారు?

గతమెంతో ఘనం.. ఇప్పుడు పాకిస్తాన్ పై టీమిండియా అథమం?