https://oktelugu.com/

Babar Azam: బాబర్ అజామ్ ప్రైవేట్ పర్సనల్ చాట్ లీక్.. షాకింగ్ విషయాలు వైరల్…

పాకిస్థాన్ కెప్టెన్ అయిన బాబర్ అజమ్ కెప్టెన్సీ పైన చాలా విమర్శలు వస్తున్నాయి.ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఆయన ప్రైవేట్ చాట్ ఒకటి లీక్ అవ్వడం జరిగింది.అసలు అది ఎవరు లీక్ చేశారు అందులో ఏముంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం...

Written By:
  • Gopi
  • , Updated On : October 31, 2023 / 10:39 AM IST

    Babar Azam

    Follow us on

    Babar Azam: ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ అస్తవ్యస్తంగా తయారైంది.వరల్డ్ కప్ లో ఏ మాత్రం సత్తా చాటకుండా ఫెయిల్యూర్ పర్ఫామెన్స్ తో పాకిస్తాన్ టీమ్ పాయింట్స్ టేబుల్ లో అట్టడుగునకు పడిపోయింది . ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ టీం మళ్లీ పుంజుకొని మ్యాచులు ఆడాలి అంటే పాకిస్తాన్ టీం కి ఇంకా చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ టీం ఘోర ఓటమౌలకి కారణం వల్ల ఓవర్ కాన్ఫిదెంట్ వాళ్ళు ఏ జట్టు మీద అయిన మేము ఈజీ గా గెలుస్తాం అనే తత్వం వాళ్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.ఈజీగా మేం గెలిచేస్తాం అనే ఒక ఓవర్ కాన్ఫిడెంట్ వల్లే వాళ్ళ ఎక్కువ మ్యాచులు గెలవలేకపోతున్నారు అనేది అందరూ తెలియజేస్తున్న విషయం…

    ఇక ఇప్పుడు పాకిస్థాన్ కెప్టెన్ అయిన బాబర్ అజమ్ కెప్టెన్సీ పైన చాలా విమర్శలు వస్తున్నాయి.ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఆయన ప్రైవేట్ చాట్ ఒకటి లీక్ అవ్వడం జరిగింది.అసలు అది ఎవరు లీక్ చేశారు అందులో ఏముంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

    అయితే పాకిస్తాన్ టీమ్ మెంబర్స్ కి పాకిస్తాన్ బోర్డు నుంచి సరైన స్పందన రావడంలేదని తెలుస్తుంది.అందులో భాగంగానే పాకిస్తాన్ ప్లేయర్లకి 5 నెలల నుంచి జీతాలు కూడా సరిగా ఇవ్వట్లేదని అందువల్లే వాళ్ళు తీవ్ర నిరాశకు గురవుతున్నారనే విషయాల మీద కూడా చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి… ఈ విషయం గురించి బాబర్‌ అజామ్‌ పీసీబీ చీఫ్ జకా అష్రఫ్‌తో కూడా మాట్లాడేందుకు ప్రయత్నించినా అలాగే మెసేజ్‌ చేసినా అతడు ఈ విషయం మీద మాట్లాడడానికి సుముఖంగా లేడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ లతీఫ్ రషీద్ ఆరోపించాడు.

    ఇలా పాకిస్థాన్ బోర్డ్ ఎప్పుడు కూడా పాకిస్థాన్ ప్లేయర్ల మీద ఆధిపత్యం చూపించాలని కుంటుంది.అందుకే ప్లేయర్లు సరిగ్గా అడలేకపోతున్నరు అని మరికొందరు సీనియర్లు బోర్డ్ ని కూడా తప్పు పడుతున్నారు.ఇక ఈ నేపథ్యంలో బాబర్‌ అజామ్‌, పీసీబీ చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్ మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌ లీక్‌ అయింది. ఇక ఇదే క్రమం లో పీసీబీ చీఫ్ జకా అష్రఫ్‌ ఒక టీవీ ప్రోగ్రాం లో పాల్గొని అతడే చాట్‌ని లీక్‌ చేశాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ చాట్ గురించే చర్చ నడుస్తోంది…ఇక పాకిస్థాన్ ప్లేయర్లు ఎప్పుడు ఎదో ఒక రకమైన వివాదంలో ఇరుక్కొని వార్తల్లో నిలుస్తూ ఉంటారు..అయితే ఆ లీక్ అయిన చట్ లో ఏముంది అంటే బాబర్‌ అజామ్, సల్మాన్‌ నసీర్ మధ్య వాట్సాప్‌లో చాటింగ్ చేసుకున్నారు.

    బాబర్ అజామ్ ని నువ్వు ఫోన్‌ చేస్తే ఛైర్మన్ స్పందించడం లేదని టీవీల్లో, సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా అదే చర్చ నడుస్తోంది నువ్వు ఇటీవల ఆయనకు ఫోన్ చేశావా అని నసీర్ అడగ్గా బాబర్ అజమ్ రిప్లే ఇస్తు నేను ఆయనకు కాల్‌ చేయలేదు అని రిప్లై ఇచ్చాడు. ఇలా జరిగిన వీళ్ళ వాట్సప్ చాట్ లీక్ అవ్వడం చూసిన పాకిస్థాన్ అభిమానులు కూడా చిన్నపిల్లల చేష్టలు ఎందుకు చేస్తున్నారు అంటూ వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ విషయం మీద మాజీ పాకిస్థాన్ ప్లేయర్ అయిన వకర్ యూనిస్ స్పందిస్తూ ఎందుకు అలా బాబర్ అజమ్ చాట్ లీక్ చేసి అతన్ని అవమాన పరుస్తున్నారు ఆయన పాకిస్థాన్ టీమ్ కి దొరికిన ఒక ఆణిముత్యం అతన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటూ వాళ్ళందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది…