https://oktelugu.com/

Ashu Reddy: అషురెడ్డి కొన్న కొత్త కారు ధర ఎంతో తెలుసా? వేణు స్వామితో ఎందుకు పూజలు చేయించింది?

అషురెడ్డికి ఆల్రెడీ ఒక కారు ఉంది. బిగ్ బాస్ తర్వాతనే ఈ కారు కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు మళ్లీ దాదాపు 70 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్ కారు కొనుక్కుంది అషు రెడ్డి. అయితే ఈ కొత్త కారుకు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 31, 2023 / 10:43 AM IST

    Ashu Reddy

    Follow us on

    Ashu Reddy: సోషల్ మీడియా హాట్ బ్యూటీ అషు రెడ్డి గురించి తెలియని వారుండరు. సమంత ఫేస్ కట్ లో ఉన్నా ఈ అమ్మడు మాస్ పీపుల్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించింది. రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ తో రాహుల్ ఫ్యాన్స్ కూడా ఈమెకు అట్రాక్ట్ అయ్యారు. బిగ్ బాస్ తర్వాత యాంకర్ గా, నటిగా, పలు టీవీ షోలలో కనిపిస్తూ బిజీగానే ఉంది. యూట్యూబ్ లో వీడియోలు పెడుతూ, సోషల్ మీడియోలో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది అషు రెడ్డి.

    అషురెడ్డికి ఆల్రెడీ ఒక కారు ఉంది. బిగ్ బాస్ తర్వాతనే ఈ కారు కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు మళ్లీ దాదాపు 70 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్ కారు కొనుక్కుంది అషు రెడ్డి. అయితే ఈ కొత్త కారుకు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించింది. మరి ఈయనతోనే ఎందుకు పూజలు చేయించిందనే అనుమానం ఎక్కువగా ఉంది. ఈయన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఫేమస్ అయ్యారు. వేణు స్వామి చెప్పే చాలా విషయాలు నిజం అవుతాయని ఎక్కువగా నమ్ముతుంటారు ప్రజలు. అంతేకాదు సెలబ్రెటీలు కూడా లైన్ కడుతుంటారు. ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు. అందుకే అషు కూడా కారు కోసం పూజ ఈయన వద్ద చేయించింది అంటున్నారు అషు అభిమానులు. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా అషు ఇలాగే వేణు స్వామితో పూజలు చేయించుకుంది.

    వేణుస్వామి కారుకు పూజ చేస్తున్న వీడియోను అషు రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు కామెంట్లు ఆఫ్ చేయడంతో అభిమానులు కామెంట్లు చేయలేకపోతున్నారు. మొత్తానికి రేంజ్ రోవర్ కారు కొనడంతో ఈ భామ ఇప్పుడు వైరల్ అవుతుంది. మాస్ పీపుల్స్ ను ఆకట్టుకునే ఈ భామ క్లాస్ పీపుల్స్ ను ఆకట్టుకోవడంలో విఫలం అవుతుంది. బికినీలు, పొట్టి డ్రెస్ లు వేస్తూ క్లాస్ ఆడియన్స్ ఆగ్రహానికి గురవుతుంది.