Babar Azam: ప్రారంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన పాకిస్తాన్ బౌలర్లు.. చివర్లో చేతులెత్తేశారు. ఫీల్డింగ్ కూడా నాసిరకంగా ఉంది. పరుగులను ధారాళంగా వదిలేయడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది.. ఒకానొక దశలో న్యూజిలాండ్ జట్టు 250 పరుగులు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివర్లో పాకిస్తాన్ బౌలర్లు సత్తా చాటలేకపోయారు.. పసలేని బౌలింగ్ తో పరుగులు దారుణంగా సమర్పించుకున్నారు.. పాకిస్తాన్ బౌలర్ల నాసిరకమైన బౌలింగ్ న్యూజిలాండ్ ఆటగాళ్లు మిచెల్, విలియమ్సన్ పండగ చేసుకున్నారు.. పాకిస్తాన్ బౌలర్లు షాహిన్ షా ఆఫ్రిది 3/88, అబ్రార్ అహ్మద్ 2/41, హరీస్ రౌఫ్ ఒక వికెట్ సాధించారు.
న్యూజిలాండ్ విధించిన 331 రన్ టార్గెట్ ను పాకిస్తాన్ చేధించలేకపోయింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ 47.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ పకార్ జమాన్ 84 పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ (3), బాబర్ అజామ్(10) చేతులెత్తేశారు. ఓపెనర్ ఫకార్ జమాన్ 84 పరుగులతో ఆకట్టుకున్నప్పటికీ.. రిజ్వాన్, అజామ్ చేతులెత్తేశారు. రిజ్వాన్, బాబర్ దూకుడుగా ఆడతారని.. లక్ష్యాన్ని చేదిస్తారని అందరూ అనుకున్నారు. కానీ న్యూజిలాండ్ బౌలర్ల ముందు వారు తేలిపోయారు..వన్డే ఫార్మాట్ లో బాబర్ అజామ్ కు నిలకడగా ఆడతాడనే పేరు ఉంది. భారీగా పరుగులు చేస్తాడనే నమ్మకం ఉంది. అతడి వన్డే చరిత్రను చూస్తే కూడా అలానే ఉంటుంది. కానీ అతడు స్వదేశంలో న్యూజిలాండ్ బౌలర్ల ముందు తేలిపోయాడు. భారీగా పరుగులు చేయాల్సిన చోట చేతులెత్తేశాడు. పది పరుగులు మాత్రమే చేసి.. నిర్లక్ష్యమైన షాట్ ఆడి అవుట్ కావడంతో..బాబర్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సొంత అభిమానులే అతడిని సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. ” ఏమయ్యా బాబర్.. ఇలానేనా ఆడేది.. ఇలా ఆడితే పాకిస్తాన్ గెలుస్తుందా.. ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంటుందా? సొంత దేశంలో చాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. గత సీజన్ లో పాక్ విజేతగా నిలిచింది. కానీ ఇప్పిడు ఆటగాళ్ల ఆట తీరు చూస్తుంటే అంత బాగున్నట్టు కనిపించడం లేదు. బాబర్ లాంటి ఆటగాడు ఇలా ఆడుతుంటే ఎలా?” అంటూ పాక్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పాక్ ఆటగాళ్లు సరిగ్గా ఆడటం లేదని.. జటను మొత్తం ప్రక్షాళన చేయాలని.. అప్పుడే చాంపియన్స్ ట్రోఫీ లో మెరుగైన ప్రదర్శన చేస్తుందని.. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Babar Azam gone for 10 runs ..#ChampionsTrophy2025 pic.twitter.com/TWgPLBJXdQ
— Muhammad UMAR (@Muhammadum20511) February 8, 2025