Vidaamuyarchi Collection: ఒకప్పుడు 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అంటే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సినిమాలో కంటెంట్ ఉంటే మీడియం రేంజ్ హీరోలు కూడా అవలీల గా ఆ మార్కుని అందుకుంటున్నారు. కాబట్టి స్టార్ హీరోలకు ఇప్పుడు 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కేవలం మొదటి రోజు టార్గెట్ లాగా మారిపోయింది. మన సౌత్ లో మొదటి రోజు 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టే రేంజ్ ఉన్న స్టార్ హీరోలలో ఒకరు తలా అజిత్. ఈయనకు తమిళనాడు లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ సాధారణమైనది కాదు. టాక్ తో సంబంధం లేకుండా ఈయనకు ఓపెనింగ్ వసూళ్లు వస్తుంటాయి. కానీ దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. స్టార్ హీరో రేంజ్ లో ఉన్నోళ్లు,ఆ స్థాయికి తగ్గట్టే సినిమాలు చేస్తూ వెళ్ళాలి. కానీ అజిత్ అలా చేయడం లేదు.
‘విడాముయార్చి’ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు స్టార్ హీరోలు చేయాల్సిన సినిమానేనా ఇది?, అజిత్ ఎందుకు ఇలాంటి సినిమాలను చేస్తున్నాడు అంటూ పెదవి విరిచారు. మొదటి రోజు వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న అజిత్ కి కేవలం 48 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవడానికి మూడు రోజుల సమయం పట్టింది. మూడేళ్ళ క్రితం ఒక స్టార్ హీరోకి రావాల్సిన వసూళ్లు, ఇప్పుడు వస్తున్నాయంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పెర్ఫార్మన్స్ అనే చెప్పాలి. ఆ వచ్చే కలెక్షన్స్ కూడా కేవలం తమిళనాడు నుండి మాత్రమే వస్తున్నాయి. ఓవర్సీస్ లో మొదటి రోజు నుండే చిల్లర వసూళ్లు వస్తున్నాయి. ఇక తెలుగు వెర్షన్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. అజిత్ కి మొదటి నుండి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండేది.
గతంలో ఆయన హీరోగా నటించిన ప్రేమ లేఖ, వాలి, గ్యాంబ్లర్, ఎంతవాడుగానీ ఇలా ఎన్నో సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఆయన మార్కెట్ మన టాలీవుడ్ లో జీరో అయిపోయింది అనొచ్చు. ఆయన గత చిత్రం తునీవు కి తెలుగులో మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ క్లోజింగ్ లో వచ్చాయి. కానీ ‘విడాముయార్చి’ చిత్రానికి మూడు రోజులకు కలిపి కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. అసలు ఏమాత్రం ఆసక్తికరంగా లేని కంటెంట్ కారణంగానే ఈ చిత్రాన్ని ఆడియన్స్ పట్టించుకోలేదని, అజిత్ తన మార్క్ సినిమాలు తీస్తే కచ్చితంగా ఆయన మార్కెట్ మన టాలీవుడ్ లో బౌన్స్ బ్యాక్ అవుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ‘విడాముయార్చి’ కి క్లోజింగ్ లో 200 కోట్ల కంటే తక్కువ గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.