Asia Cup squad 2025: అప్పట్లో బాబర్ అజాం కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వీర లెవెల్ లో ఎలివేషన్లు ఇచ్చేది. పాకిస్తాన్ పాలిట విరాట్ కోహ్లీ లాగా అభివర్ణించేది. మావాడు తోపు దమ్ముంటే ఆపు అన్నట్టుగా జాకీలు పెట్టి లేపేది. అప్పుడప్పుడు బాబర్ గొప్ప ఇన్నింగ్స్ ఆడటంతో.. పాకిస్తాన్ అతి చేయడంలో తప్పు లేదనిపించింది. కానీ ఆ తర్వాతే బాబర్ ట్రాక్ తప్పాడు.
ఏ ఫార్మాట్లోనైనా విఫలమవడం పరిపాటిగా మార్చుకున్నాడు. తద్వారా జట్టు వరుసగా ఓటములు పొందుతూ వస్తోంది. స్వదేశంలోనూ అత్యంత దారుణంగా ఓడిపోతూ పరువు తీసుకుంటున్నది. అయినప్పటికీ బాబర్ ఆటలో మార్పు రాలేదు. ఇప్పట్లో మార్పు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. అబేధ్యమైన పరుగులు తీసి అదరగొట్టిన అతడు ఇప్పుడు అనామక బౌలర్ల చేతిలో అవుట్ అవుతున్నాడు. షార్ట్ పిచ్ నుంచి మొదలుపెడితే ఇన్ స్వింగర్ల వరకు బంతులను ఎదుర్కోలేక విఫలమవుతున్నాడు.
Also Read: మీరు చెప్పిన మాట వినడమే గిల్ చేసిన నేరమా.. ఇలా వెన్నుపోటు పొడుస్తారా?
ఇటీవల వెస్టిండీస్ టూర్ లో కూడా బాబర్ విఫలమయ్యాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతడు తన చివరి సెంచరీ నేపాల్ జట్టు మీద చేశాడు. 70 ఇన్నింగ్స్ దాటిపోయినప్పటికీ అతని బ్యాట్ నుంచి ఇంతవరకు సెంచరీ నమోదు కాలేదంటే.. బాబర్ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో బాబర్ ను ఆసియా కప్ నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. అతడు మాత్రమే కాకుండా రిజ్వాన్ ను కూడా ఎంపిక చేయలేదని తెలుస్తోంది. ఆశ కప్ లో పాకిస్తాన్ జట్టుకు సల్మాన్ అలీ సారథిగా వ్యవహరిస్తాడు. జట్టులో ఆడేందుకు అర్బార్, ఫహీం, ఫకర్, రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, తలాత్, కుష్ దిల్ షా, హరీస్, నవాజ్, జూనియర్ వసీం, ఫర్హాన్, సయీం ఆయుబ్, సల్మాన్ మీర్జా, షాహిన్, సుఫియాన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.