Mohammad Azharuddin: హెచ్ సి ఏ ప్రెసిడెంట్ గా అజారద్దున్ ని తొలగించడం వెనక అసలు కారణం ఇదే…

నిజానికి అజారుద్దీన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత హెచ్ సి ఏ కి చేసింది ఏమీ లేదు. కొద్ది రోజుల క్రితం విను మన్కడ్ ట్రోఫీకి సంబంధించిన అండర్ 19 సెలక్షన్స్ లలో కూడా దారుణమైన అవినీతి జరిగిందని అజారుద్దీన్ పైన చాలామంది కామెంట్లు చేయడం జరిగింది.

Written By: Gopi, Updated On : October 6, 2023 10:03 am

Mohammad Azharuddin

Follow us on

Mohammad Azharuddin: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఉన్నది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్ అభివృద్ధికి తోడ్పడే విధంగా హైదరాబాద్ లో ఈ అసోసియేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన స్టేట్ కి సంబంధించిన క్రికెట్ ప్లేయర్ల సెలక్షన్స్ కానీ వాళ్లకు సంబంధించిన మ్యాచులను నిర్వహించి వాళ్ళలో బాగా ఆడేవాళ్ళకి అండర్ 19 లలో ఛాన్స్ లు ఇవ్వాలి.

అయితే 2019 సంవత్సరంలో అజారుద్దీన్ హెచ్ సి ఏ కి ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన్ని హెచ్ సి ఏ అధ్యక్షుడిగా తీసేస్తూ ఆయనపై హెచ్ సి ఎ లో అనర్హత వేటుని విధించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇటు హెచ్ సిఏ కి ప్రెసిడెంట్ గా ఉంటూనే అటు డక్కన్ బ్లూస్ అనే క్రికెట్ క్లబ్ కి కూడా ప్రెసిడెంట్ గా వ్యవహరించడం జరుగుతుంది.అలా రెండు అసోసియేషన్లకి ప్రెసిడెంట్ గా ఉండడం అనేది చాలా వరకు తప్పు… ఎందుకంటే ఈ రెండింటిలో ప్రెసిడెంట్ గా ఉండడం వల్ల ప్లేయర్ల కి సంబంధించిన ఇబ్బందులను తెలుసుకోవడంలో గాని, వాళ్లకు సంబంధించిన సమస్యలకి పరిష్కారాలను వెతకడంలో గాని ప్రెసిడెంట్ అనేవారు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు.

ఇలా ఉండడం వల్ల వాళ్లకు సంబంధించిన డబ్బులను ఎక్కువగా వెనుకేసుకోవడం తప్ప వాళ్లు అసోసియేషన్ కి చేసేది ఏమీ ఉండదు. ఇలా రెండింటికి ప్రెసిడెంట్ గా ఉన్న అజారద్దున్ పైన సుప్రీం కోర్టు హెచ్ సి ఎ భాద్యతల కోసం నియమించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటి అజారుద్దీన్ ను ప్రెసిడెంట్ గా తొలగిస్తూ హెచ్ సి ఎ ఓటర్ల జాబితా నుంచి కూడా ఆయన పేరుని తీసివేయడం జరిగింది. దీనివల్ల అజారుద్దీన్ ఒక రెండు మూడు సంవత్సరాల వారికి హెచ్ సి ఎ లో పోటీ చేయడమే కాకుండా ఓటు వేయడానికి కూడా వీలు లేకుండా సుప్రీంకోర్టు హెచ్ సి ఏ బాధ్యతలను చూసుకుంటున్న లావు నాగేశ్వర రావు కమిటి అజారుద్దీన్ పైన అనర్హత వేటును వేసింది.అంటే ఇప్పుడు ఆయన పోటీ చేయడమే కాదు హెచ్ సిఎ ఎలక్షన్ లలో ఓటు వేయడానికి కూడా కుదరదు.

నిజానికి అజారుద్దీన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత హెచ్ సి ఏ కి చేసింది ఏమీ లేదు. కొద్ది రోజుల క్రితం విను మన్కడ్ ట్రోఫీకి సంబంధించిన అండర్ 19 సెలక్షన్స్ లలో కూడా దారుణమైన అవినీతి జరిగిందని అజారుద్దీన్ పైన చాలామంది కామెంట్లు చేయడం జరిగింది.జిల్లాల వారిగా సెలెక్ట్ చేసిన ప్లేయర్ లలో ఇద్దరిని మాత్రమే టీం కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే బాగా ఆడుతున్నారో ఆ ప్లేయర్ ని సెలెక్ట్ చేయకుండా ఉండడం, ఎవరైతే డబ్బులు ఇస్తారో వారిని మాత్రమే సెలెక్ట్ చేసి ప్లేయింగ్ 11 లో ఆడించే విధంగా చూసుకోవడం, డబ్బులు ఇవ్వని ప్లేయర్లని ఒకవేళ సెలెక్ట్ చేసిన కూడా 14 ,15 ప్లేయర్లు గా సెలెక్ట్ చేసి వాళ్ళని బెంచ్ కే పరిమితం చేస్తున్నారు.అంతే తప్ప వాళ్ళకి మ్యాచులు ఆడే అవకాశాలను ఇవ్వడం లేదు అంటూ అప్పట్లో అండర్ 19 కి ఆడే ప్లేయర్ల పేరెంట్స్ వాళ్ల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది…

ఇక ఇప్పుడు అజారుద్దీన్ పైన వేటు వేయడానికి కూడా ఇవన్నీ కారణమనే చెప్పాలి.ఇక రీసెంట్ గా అన్ని ఫార్మాట్లకు రిటైర్ మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు కూడా హెచ్ సి ఏ మీద స్పందిస్తూ ఇప్పుడు హెచ్ సి ఏ ఐసీయూలో ఉంది బతకడానికి, చావడానికి మధ్యలో కొట్టుకుంటుంది అంటూ చాలా వ్యంగ్యంగా హెచ్ సి ఏ గురించి మాట్లాడడం జరిగింది…