https://oktelugu.com/

IND vs PAK: పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ లో చెత్త రికార్డును నెలకొల్పిన బౌలర్ షమీ

పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీం ఇండియా తరపున మొదటి ఓవర్ వేశాడు. ఈ ఓవర్ వేసి తన కెరీర్లో చెత్త రికార్డును షమీ క్రియేట్ చేసుకున్నాడు. ఒక ఓవర్ 6 బంతులు ఉంటే షమీ మాత్రం 11 బంతులు వేశాడు. ఒక్క ఓవర్లోనే 5వైడ్స్ వేసి అందరినీ షాక్ కు గురిచేశాడు.

Written By: , Updated On : February 23, 2025 / 05:06 PM IST
Mohammed Shami

Mohammed Shami

Follow us on

IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మ్యాచ్ జరుగుతోంది. ఆదివారం దుబాయ్‌లో భారత్‌తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీం ఇండియా తరపున మొదటి ఓవర్ వేశాడు. ఈ ఓవర్ వేసి తన కెరీర్లో చెత్త రికార్డును షమీ క్రియేట్ చేసుకున్నాడు. ఒక ఓవర్ 6 బంతులు ఉంటే షమీ మాత్రం 11 బంతులు వేశాడు. ఒక్క ఓవర్లోనే 5వైడ్స్ వేసి అందరినీ షాక్ కు గురిచేశాడు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇప్పటికే పాక్ రెండు ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ గా వచ్చిన బాబర్ అజామ్ ఉన్నంత సేపు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్ లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న బాబర్ ఆజమ్ అవుట్ కావడం పై పాక్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

ఇది ఇలా ఉంటే బంగ్లాదేశ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే వికెట్ తీసిన మహ్మద్ షమీ ఈసారి కూడా అలాంటి ప్రదర్శన ఇస్తాడని అంతా భావించారు. కానీ ఈసారి అలా జరగలేదు. షమీ ఈ మ్యాచ్ లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. మొదటి ఓవర్ పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది.

షమీ ఓవర్‌ను బాగానే మొదలుపెట్టాడు కానీ తర్వాతి బంతి వైడ్ అయింది. ఆ తర్వాత ఈ ఓవర్‌లో అతను ఒక్కొక్కటిగా 5 వైడ్‌లు వేశాడు. దీని కారణంగా షమీ ఆ ఓవర్ పూర్తి చేయడానికి 11 బంతులు వేయాల్సి వచ్చింది. తద్వారా పాకిస్తాన్‌కు మంచి ఆరంభం లభించింది. ఆ ఓవర్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చినప్పటికీ, పాకిస్తాన్ ఓపెనర్ ఎలాంటి ఒత్తిడికి లోనైనట్లు కనిపించలేదు. వన్డే క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 5 వైడ్‌లు వేసిన తొలి భారత బౌలర్‌గా షమీ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. వన్డేలో 11 బంతుల ఓవర్ వేసిన మూడో భారత బౌలర్‌గా కూడా అతను నిలిచాడు. అతని కంటే ముందు జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ కూడా తలా 11 బంతుల ఓవర్లు బౌలింగ్ చేశారు.

షమీ ఇలా బౌలింగ్ చేయడం వెనుక కారణం కొద్దిసేపటిలోనే స్పష్టమైంది. ఈ స్పెల్ సమయంలో షమీ గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. తన మూడవ ఓవర్ మధ్యలో షమీకి మోకాలికి కొంత నొప్పి అనిపించింది. దాని కారణంగా టీం ఇండియా ఫిజియో మైదానంలోకి వచ్చి అతనిని పరీక్షించాల్సి వచ్చింది. షమీ ఏదో ఒకవిధంగా ఈ ఓవర్ పూర్తి చేసాడు కానీ ఆ వెంటనే అతను డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వచ్చాడు. మైదానం నుండి బయటకు వెళ్తున్నప్పుడు షమీ పూర్తిగా ఫిట్‌గా లేడని తన నడక చూస్తుంటే అర్థం అవుతుంది.