Mitchell Starc: ఆస్ట్రేలియా బౌలర్.. సాధించేశాడు

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో స్టార్ కు రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 313 వికెట్లతో ఐదవ స్థానంలో ఉన్న మిచెల్ జాన్సన్ ను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి చేరుకున్నాడు స్టార్క్.

Written By: BS, Updated On : July 2, 2023 11:50 am

Mitchell Starc

Follow us on

Mitchell Starc: ఆస్ట్రేలియా జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ మరో ఘనత సాధించాడు. లార్డ్స్ వేదికగా యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న రెండో టెస్టులో స్టార్క్ ఈ ఘనతను దక్కించుకున్నాడు. ఈ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు సాధించిన స్టార్క్.. ఆస్ట్రేలియా జట్టు తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానానికి చేరాడు.

ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ విభాగం ఎప్పుడూ బలంగానే ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఆ జట్టు బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్న బౌలర్ మిచెల్ స్టార్క్. ఈ క్రమంలోనే స్టార్క్ మరో ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఘనతను నమోదు చేసుకున్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీయడం ద్వారా ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

మిచెల్ జాన్సన్ ను వెనక్కి నెట్టిన స్టార్క్..

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో స్టార్ కు రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 313 వికెట్లతో ఐదవ స్థానంలో ఉన్న మిచెల్ జాన్సన్ ను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి చేరుకున్నాడు స్టార్క్.
రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు సాధించడం ద్వారా 315 వికెట్ల తీసి టాప్ ఫైవ్ లోకి చేరుకున్నాడు. 79 టెస్టుల్లో 315 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు స్టార్క్. ఈ జాబితాలో ఆస్ట్రేలియా తరఫున 708 వికెట్లతో షేన్ వార్న్ టాప్ లో ఉండగా, మెక్ గ్రాత్ 563 వికెట్లతో రెండో స్థానంలో, 496 వికెట్లతో మూడో స్థానంలో నాథన్ లియోన్ ఉన్నారు. అలాగే డెన్నీస్ లిల్లీ 355 వికెట్లతో నాలుగో స్థానంలో ఉండగా,
315 వికెట్లతో ఐదో స్థానానికి స్టార్క్ చేరుకున్నాడు. మిచెల్ జాన్సన్ 313 వికెట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు.