Australia’s iconic cricket stadium: ఆ స్టేడియం పేరు గబ్బా.. బ్రిస్బెన్ ప్రాంతంలో ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ దీనిని నిర్మించింది. నాటి రోజుల్లో దీనికి ఎంత ఖర్చయిందో తెలియదు కాని.. దశాబ్దాల కాలాన్ని ముందుగానే ఊహించి ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ గబ్బా స్టేడియాన్ని నిర్మించింది. ఈ మైదానం 1895లో నిర్మితమైంది.. ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ నిర్మించిన క్రికెట్ మైదానాలలో ఇది ప్రముఖమైనది. ఈ మైదానంలో 2021లో కంగారు జట్టుపై భారత్ సాధించిన విజయం అత్యంత చారిత్రాత్మకమైనది. ఈ మైదానం అవిశ్రాంతంగా సేవలు అందించింది. ముఖ్యంగా కంగారు జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించింది. అందువల్లే ఈ మైదానాన్ని విన్నింగ్ గ్రౌండ్ గా కంగారు జట్టు ప్లేయర్లు భావిస్తుంటారు. ఈ మైదానం మీద ఆడటాన్ని వారు ఆస్వాదిస్తూ ఉంటారు. 1895లో నిర్మించిన ఈ మైదానం ఇప్పుడు శిధిలావస్థకు చేరుకుంది. అప్పుడప్పుడు ఇందులో మరమ్మతులు చేసినప్పటికీ.. ఇక స్టేడియం సామర్థ్యం కూడా తగ్గిపోతున్న నేపథ్యంలో క్వీన్స్ ల్యాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంగారు జట్టు మేనేజ్మెంట్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ మైదాన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: భారత్తో తొలి టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టిదే
శిథిలావస్థకు చేరుకొన్న నేపథ్యంలో..
గబ్బా మైదానం శిథిలావస్థకు చేరుకుంది. గతంలో నిర్మించిన పైకప్పు పెచ్చులు ఊడినట్టు కనిపిస్తోంది. అయితే గతంలో దీనికి అక్కడక్కడ మరమ్మతులు చేశారు. అయినప్పటికీ స్టేడియం సామర్థ్యం శత సంవత్సరాలను దాటిపోయిన నేపథ్యంలో ఇకపై ఇందులో మ్యాచులు నిర్వహించే అవకాశాన్ని పరిగణలోకి తీసుకోవద్దని ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ పేర్కొంది. ఇందులో భాగంగానే 2032లో ఈ మైదానాన్ని కూల్చివేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయాన్ని క్వీన్స్ లాండ్ ప్రభుత్వంతో పంచుకుంది. దీంతో క్వీన్స్ ల్యాండ్ ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది..” బ్రిస్బేన్ ప్రాంతానికి ఈ మైదానం ఒక అందమైన నగలాంటిది. గత 130 సంవత్సరాలుగా ఇది అనేక మ్యాచ్లకు వేదికగా నిలిచింది. ఈ మైదానం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో దీనిని కూల్చివేయాలని నిర్ణయించాం. దాని స్థానంలో ఎలాంటి మైదానం నిర్మించాలనేది ఆలోచించలేదు. 2032లో నిర్వహించే ఒలంపిక్స్ తర్వాత ఈ మైదానం కాలగర్భంలో కలిసిపోతుంది. ఇక 2032 తర్వాత బ్రిస్బేన్ వేదికగా నిర్వహించే క్రికెట్ మ్యాచ్లు మొత్తం విక్టోరియా పార్క్ వద్ద నిర్మించే స్టేడియంలో జరుపుతామని” క్వీన్స్ లాండ్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికి ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఎంతో గొప్ప చరిత్ర కలిగి గబ్బా స్టేడియం కాలగర్భంలో కలిసిపోవడాన్ని క్రికెట్ ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ స్టేడియం తో తమకు ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.