Ind Vs Aus 4th Test 2024: డిసెంబర్ 26 నుంచి బాక్సింగ్ డే సందర్భంగా మెల్ బోర్న్ లో నాలుగో టెస్ట్ మొదలుకానుంది. గత రెండు సీజన్లలో బాక్సింగ్ డే టెస్ట్ లలో టీమ్ ఇండియా గెలిచింది. ఒకసారి విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో, మరొకసారి అజింక్య రహనే ఆధ్వర్యంలో టీమిండియా గెలుపులను సొంతం చేసుకుంది. అయితే ఈసారి కూడా బాక్సింగ్ డే టెస్ట్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని టీమిండియా భావిస్తోంది. ఇందులో భాగంగా గత కొద్దిరోజులుగా జట్టు ఆటగాళ్లు మెల్ బోర్న్ మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు నెట్స్ లో తీవ్రంగా సాధన చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా బేస్ బాల్ బ్యాట్ తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ, రాహుల్, ఇతర ఆటగాళ్లు కూడా తీవ్రంగా సాధన చేస్తున్నారు. సాధన చేసే క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు.. దీంతో ఒక్కసారిగా జట్టులో కలకలం నెలకొంది. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 37 సంవత్సరాలు. బహుశా అతడికి ఇదే చివరి బోర్డర్ గవాస్కర్ సిరీస్. ఇప్పటికే t20 లకు అతడు వీడ్కోలు పలికాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతున్నాడు. టీమిండియా కు ఈసారి కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందించి.. హ్యాట్రిక్ రికార్డు సృష్టించాలని అతడు భావిస్తున్నాడు. తొలి టెస్ట్ కు వ్యక్తిగత కారణాలవల్ల రోహిత్ దూరమయ్యాడు. రెండో టెస్టులో జట్టుకు నాయకత్వం వహించినప్పటికీ.. ఆ టెస్టులో భారత్ ఓడిపోయింది. మూడవ టెస్ట్ డ్రా అయింది. అయితే రెండు టెస్టులలో రోహిత్ శర్మ తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. ఫాస్ట్ బౌలర్ల చేతికి చిక్కి పెవిలియన్ చేరుకున్నాడు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకున్నాడని తెలుస్తోంది. అతడు మెల్ బోర్న్ టెస్టులో ఆడతాడని సమాచారం..” అతడు గాయపడ్డాడు. కాకపోతే కోలుకున్నాడు. నెట్స్ లో సాధన చేస్తున్నాడు. స్వల్ప గాయం కావడంతో పెద్దగా ఇబ్బంది లేదని” జట్టు వర్గాలు చెబుతున్నాయి.
తలనొప్పి మళ్లీ మొదలైంది
ఈ సిరీస్ లో టీం ఇండియాకు కొరకరాని కొయ్యగా మారాడు ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్. ఈ సిరీస్ లో అతడు ఇప్పటికే రెండు సెంచరీలు చేశాడు. ముఖ్యంగా ఆడిలైడ్ టెస్ట్ లో తన హవా కొనసాగించాడు. అదే జోరును బ్రిస్బేన్ టెస్ట్ లోనూ పునరావృతం చేశాడు. మొత్తంగా తిరుగులేని ఫామ్ తో ఆకట్టుకుంటున్నాడు. అయితే హెడ్ మెల్ బోర్న్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు. అయితే అతడు గాయం వల్ల నాలుగో టెస్ట్ కు దూరం అవుతాడని అందరూ అనుకున్నారు.. అయితే ఆ గాయం నుంచి అతడు కోలుకున్నాడని.. నాలుగో టెస్ట్ ఆడతాడని ఆస్ట్రేలియా మీడియా చెబుతోంది. తన కథనాలలో ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది..” హెడ్ గాయపడింది నిజమే. కాకపోతే అతడు బౌన్స్ బ్యాక్ అయ్యాడు. కచ్చితంగా నాలుగో టెస్ట్ ఆడతాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొత్తం అతడి భుజస్కంధాలపై ఉంది. అతడి ఆగమనం జట్టుకు లాభం చేకూర్చుతుందని” ఆస్ట్రేలియా మీడియా చెబుతోంది. రోహిత్ గాయం నుంచి కోల్పోవడం టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ అయితే.. హెడ్ కూడా గాయం నుంచి కోలుకొని నాలుగో టెస్ట్ కు అందుబాటులోకి రావడం.. చేదువార్త అని నెటిజన్లు అంటున్నారు.