Government Jobs: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అది కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇప్పుడు భారత ప్రభుత్వ కంపెనీలో ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం ఉంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో జాబ్ లు ఉన్నాయి. దీని కోసం కూడా ఇప్పటికే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ recindia.nic.in లో చూడవచ్చు. ఇక్కడ నుంచి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. కానీ ఈ పోస్టులకు మాత్రం మీరు ముందే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోనే దరఖాస్తు చేసుకోండి.
ఈ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్/చీఫ్ మేనేజర్/అధికారిక భాషా వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఈ పోస్టుల్లో మొత్తం 74 ఖాళీలు ఉండటంతో వాటిని ఫిల్ చేయాలి అనుకుంటున్నారు. recindia.nic.inలో కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత మీరు సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి చివరి తేదీ డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంది. సో ఈ సమయంలోపే దరఖాస్తు చేసుకోండి. ఇక రుసుము వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు.
REC లిమిటెడ్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్/చీఫ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్‌లో B.Tech/M.Tech డిగ్రీని చేసి ఉండాలి. డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 48 ఏళ్లు ఉండాలి. ఇక చీఫ్ మేనేజర్ పోస్టులకు మాత్రం 45 ఏళ్లు ఉండాలి అని ఖరారు చేశారు. అధికారి కావడానికి, వయోపరిమితి 33 సంవత్సరాలు. ఇక డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్‌కు గరిష్ట వయస్సు మాత్రం 39 సంవత్సరాలు ఉండాలి అని నోటిఫికేషన్ లో తెలిపారు. ఇది కాకుండా, వివిధ పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. వాటి వివరాలను ఇక్కడ నోటిఫికేషన్‌లో చూడవచ్చు .
REC లిమిటెడ్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు జీతం రూ. 1,00,000-2,60,000 కాగా, చీఫ్ మేనేజర్ జీతం రూ.80,000గా ఉంటుంది. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ జీతం రూ.70,000-2,00,000గా నిర్ణయించారు. ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు రూ. 50,000-1,60,000 జీతం పొందుతారు. డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్) రూ.70,000-2,00,000. ఇక మీరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లే చేసుకోవాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేసుకోవడం ఉత్తమం. అయితే వెయ్యి రూపాయల రుసుము ఉంది కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లే చేసుకోండి.