https://oktelugu.com/

BGT 2024: టోర్నీ జరుగుతుంటే.. సునీల్ గవాస్కర్ ను అంత మాట అనేసాడేంటి.. ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ కు ఏమైంది?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులోకి అడుగు పెట్టింది. శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా రెండవ టెస్టు జరగనుంది. గులాబీ రంగు బంతితో డే అండ్ నైట్ విధానంలో ఈ టెస్ట్ నిర్వహించనున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 6, 2024 / 08:07 AM IST

    BGT 2024

    Follow us on

    BGT 2024: టెస్ట్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. తొలి టెస్ట్ లో భారత జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టిన జోష్ హేజిల్ వుడ్ రెండవ టెస్ట్ కు దూరమయ్యాడు. అతడు గాయం కారణంగా సీరియస్ మొత్తానికే రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యాడు. అతని స్థానంలో బోలాండ్ కు అవకాశం లభించింది. అతడు ఆడటం దాదాపుగా ఖాయం అయింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టును ఉద్దేశించి సునీల్ గవాస్కర్ రాసిన కాలమ్ వివాదానికి కారణమైంది. రెండో టెస్టు ప్రారంభం కి ముందు ఓ పత్రికకు సునీల్ గవాస్కర్ కాలమ్ రాశాడు. అందులో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు హాజిల్ వుడ్ రెండవ టెస్టుకు దూరమవుతున్నాడని గవాస్కర్ వివరించాడు..” తొలి టెస్ట్ లో ఊహించని విధంగా ఆస్ట్రేలియా ఓటమిని ఎదుర్కొంది. 295 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆస్ట్రేలియా జట్టులో విపరీతమైన భయం అలముకుంది. అందువల్లే ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ కొంతమంది ఆటగాళ్లపై వేటు వేసింది. తొలి టెస్ట్ లో ఓటమి తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు హాజిల్ వుడ్ చెప్పిన సమాధానమే అతడిని జట్టుకు దూరం చేసింది. బౌలర్లు ఏం చేయలేరని హాజిల్ వుడ్ పేర్కొన్నాడు. బ్యాటర్లు ఆస్ట్రేలియాను రక్షించాలని అతడు కోరాడు. ఇది ఆస్ట్రేలియా జట్టులో ఉన్న లోపాలను బహిర్గతం చేసింది. వాస్తవానికి హాజిల్ వుడ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు. అందువల్లే అతనికి రెండో టెస్టులో అవకాశం లభించలేదు. గతంలో భారత జట్టులో ఇలా ఉండేది. ఇప్పుడు ఆస్ట్రేలియా దానిని అనుసరిస్తుందని” సునీల్ గవాస్కర్ తను రాసిన కాలమ్ లో ప్రస్తావించాడు. గవాస్కర్ రాసిన కాలమ్ పై ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్పందించాడు.

    పాడ్ కాస్ట్ లో ఏం చెప్పారంటే..

    సునీల్ గవాస్కర్ రాసిన కాలమ్ ఆస్ట్రేలియా జట్టుకు ఇబ్బందికరంగా మారడంతో.. ఆసీస్ స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ స్పందించాడు..” సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలు సరికాదు. అతను రాసిన మాటలు చూస్తుంటే హాస్యాస్పదం లాగా ఉంది. అతడి వ్యవహార శైలి జోకర్ ను గుర్తు చేస్తుంది. అతని వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సునీల్ గవాస్కర్ కొంతకాలంగా క్రికెట్ ను వదిలిపెట్టి వినోద కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం కొన్ని జట్లు చెబుతున్నాయి. అయితే ఆయన కామెంట్రీ ప్యానెల్ లో ప్రస్తుతం సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు ఆయనకు వినోదాన్ని ఇస్తున్నాయి కావచ్చు. అయితే వాటిని కొనసాగిస్తారా? లేదా? అనేది ఆయన ఇష్టం. కాకపోతే మా జట్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సమర్థించలేం. అన్ని జట్లకు అంతర్గతంగా కొన్ని విషయాలు జరుగుతుంటాయి. వాటిని బయట పెట్టడం సమంజసం కాదు. టీమిడియాలో అలాంటివి కూడా జరుగుతున్నాయి.. అలాంటి వాటిని ఈయన బయట పెట్టే ధైర్యం చేయగలరా” అంటూ హెడ్ వ్యాఖ్యానించాడు. హెడ్ మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాలోని చాలామంది ఆటగాళ్లు సునీల్ గవాస్కర్ వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.