Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల్లో మార్పు ఉంటుంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్యం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు రవి యోగం ఏర్పడడంతో సింహాతో సహా కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టం కలగనుంది. మేషం నుంచి మీన వరకు 12 రాశులఫలితాల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాలకు వెళ్ళండి..
మేష రాశి: కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారాలకు మంచి లాభాలు వస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృషభరాశి: అనుకున్న పనులు ఈరోజు నెరవేరుతాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టుల ప్రారంభిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో ఉల్లాసంగా ఉంటారు. కొందరు మీ పనులకు ఆటంకం కలిగించవచ్చు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి: కోర్టుకు సంబంధించిన కేసులు నేటితో పరిష్కారం అవుతాయి. కొన్ని పనులను వాయిదా వేసుకోవడమే మంచిది. అనుకోకుండా వ్యాపారులకు లాభాలు ఉంటాయి. బంధువుల సాయంతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు.
కర్కాటక రాశి: ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో వివాదం కారణంగా మనసు ఆందోళనగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడమే మంచిది. విదేశాల్లో ఉండే విద్యార్థుల నుంచి శుభవార్త వింటారు.
సింహా రాశి: అనవసర ఖర్చులు పెరుగుతాయి. దీంతో ఆందోళనగా ఉంటారు. అయితే బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. విదేశాల్లో ఉండే విద్యార్థుల నుంచి శుభవార్తలు ఉంటారు.
.కన్యరాశి: కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సాయంత్రం ఆహారం నియంత్రణ ఉంచుకోవాలి. లేకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం.
తుల రాశి:ఈ రాశి వ్యాపారలు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే వాయిదా వేసుకోవాలి. లేకుంటే తీవ్ర నష్టాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. సాయంత్రం కుటుంబ సభ్యుల తో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి: సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు అనుకొని అదృష్టం వరిస్తుంది. బంధువులతో ఉత్సాహంగా ఉంటారు. కొన్ని శుభ కార్యక్రమా లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి: పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొన్ని పనులకు స్నేహితుల సహాయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి: శత్రువులతో జాగ్రత్త గా ఉండాలి. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. రాజకీయ రంగాల్లో ఉండేవారికి ఈరోజు అనుకూల సమయం. కొన్ని పనులు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాయి.
కుంభ రాశి: వ్యాపారులు కొన్ని పనులు కారణంగా ఇబ్బంది పడతారు. అయితే చాలా విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఓపికతోనే పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు సీనియర్ల నుంచి వేధింపులు ఎదుర్కొంటారు.
మీనరాశి: ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం. పిల్లల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.