Jasprit Bumrah : భారత స్పీడ్ గన్ బుమ్రా చేతిలో వణికిపోయింది. బుమ్రా కు మహమ్మద్ సిరాజ్ తోడు కావడంతో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బెంబేలెత్తిపోయింది. లబూషేన్(70), కమిన్స్(41) మాత్రమే ప్రతిఘటించగలిగారు. తొలి ఇన్నింగ్స్ లో దుమ్ములేపిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. రెండవ ఇన్నింగ్స్ లో బ్యాట్లు ఎత్తేయడానికి కారణం ఆస్ట్రేలియా ఆటగాళ్ల స్వయంకృతాపరాధం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత్ ఒకప్పటి జట్టు కాదు. ఆస్ట్రేలియా తిడితే పడటానికి.. పదునైన బంతులు వేస్తే బ్యాట్ ఎత్తేయడానికి.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సమయంలో ఆస్ట్రేలియా బౌలర్ బోలాండ్ చేతిలో కోహ్లీ అవుట్ అయ్యాడు. ఆ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బుమ్రా మాదిరిగా చేతులు పైకి లేపి అరవాలి అన్నట్టుగా.. ఆస్ట్రేలియా అభిమానులకు సంకేతాలు ఇచ్చారు. బుమ్రా డక్ ఔట్ అయినప్పుడు కూడా అదే విధంగా చేశారు. ఇది బుమ్రా కు ఎక్కడో కాలేలా చేసింది. దీంతో అతడు తన ప్రతీకారాన్ని ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో తీర్చుకోవడం మొదలుపెట్టాడు. తనదైన పదునైన బంతులు వేస్తూ ఆస్ట్రేలియాను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లను.. రెండవ ఇన్నింగ్స్ లో తోక ముడిచేలాగా చేయగలిగాడు. తొలి ఇన్నింగ్స్ లో 60 పరుగులు చేసిన సాన్ కోన్ స్టాస్ ను 8 పరుగుల క్లీన్ బౌల్డ్ చేశాడు. ట్రావిస్ హెడ్ ను ఒక్క పరుగుకే పెవిలియన్ పంపించాడు. మార్ష్ ను 0 పరుగులకే అవుట్ చేశాడు. క్యారీ ని 2 పరుగుల వద్ద బలిగొన్నాడు. మొత్తంగా ఆస్ట్రేలియాను 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయేలా చేశాడు. ఆ తర్వాత కమిన్స్, లబూ షేన్ ఏడో వికెట్ కు 57 పరుగులు జోడించారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆస్ట్రేలియా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
నెట్టింట విమర్శలు
ఆస్ట్రేలియా ఆటగాళ్లు టీమిండియా ప్లేయర్లను స్లెడ్జింగ్ చేసిన నేపథ్యంలో నెట్టింట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా టీమ్ ఇండియా అభిమానులు ఆస్ట్రేలియా ఆటగాళ్లను గట్టిగా వేసుకుంటున్నారు. ” నిప్పుతో ఎవడైనా నేషనల్ గేమ్స్ ఆడుతాడా. ఆస్ట్రేలియా ప్లేయర్ల పరిస్థితి కూడా అలానే ఉంది. బుమ్రా కు తిక్కరేగితే ఏం జరుగుతుందో అనుభవంలోకి వచ్చింది. అతడిని అనవసరంగా గెలుక్కున్నారు. దీంతో అతడు ప్రతీకారాన్ని మొదలుపెట్టాడు.. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో.. వికెట్ల మీద వికెట్లు తీస్తున్నాడు. ఆస్ట్రేలియా వాళ్లకు టీం ఇండియా అంటే ఇప్పుడు అర్థమైందనుకుంటా.. స్లెడ్జింగ్ ఎక్కడ చేసిన పర్వాలేదు. కానీ టీమ్ ఇండియా మీద చేస్తే ఆస్ట్రేలియాకు సినిమా అర్థమవుతుంది. కొరివితో తల గోక్కోవడాన్ని ఆస్ట్రేలియా ఆటగాళ్లు మానుకోవాలి. అప్పుడే అది వాళ్ళ జట్టుకు లాభం చేకూర్చుతుందని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
GOOSEBUMPS COMMENTARY ON SEN CRICKET FOR BUMRAH. pic.twitter.com/C3zKHeAyF4
— Johns. (@CricCrazyJohns) December 29, 2024
WHAT A PEACH FROM BUMRAH TO CLEAN UP CAREY pic.twitter.com/JT65whONhw
— Johns. (@CricCrazyJohns) December 29, 2024
This is the video of the day.♥️ pic.twitter.com/xbV6FJSPj8
— ena J.Gill (@JaiShreeRam90) December 29, 2024