India Vs Australia World Cup: ఇండియన్ టీమ్ ని దారుణంగా అవమానించిన ఆస్ట్రేలియా ప్లేయర్లు…

వరల్డ్ కప్ లో జరిగిన అవమానానికి ఇండియన్ టీం మొదటి టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి వాళ్ల మీద రివేంజ్ ని తీర్చుకుందనే చెప్పాలి. ఇక నిజానికి ఈ మ్యాచ్ విజయంతో ఇండియన్ అభిమానులు అందరూ కూడా ఒక వంతుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Written By: Gopi, Updated On : November 25, 2023 6:07 pm

India Vs Australia World Cup Final

Follow us on

India Vs Australia World Cup: వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది.ఇక దాంతో ఆస్ట్రేలియా టీమ్ ఆరోసారి వరల్డ్ కప్ ని వాళ్ల దేశానికి అందించి ప్రపంచం లోనే ఆరోవసారి వరల్డ్ కప్ అందుకున్న ఏకైక టీం గా ఆస్ట్రేలియా గుర్తింపు పొందింది.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఆస్ట్రేలియా చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఆస్ట్రేలియన్ ప్లేయర్ల పైన ఇండియన్ అభిమానులు తీవ్రమైన కోపంతో ఉన్నారు.

ఎందుకు అంటే ఈమధ్య ఆస్ట్రేలియాకు చెందిన ఒక మీడియా సంస్థ ఇండియన్ ప్లేయర్లని అవమానిస్తూ అభ్యంతరకరమైన పోస్టును పెట్టింది. ఇక అందులో ఏముంది అంటే సౌత్ ఆస్ట్రేలియా మెన్ గివ్స్ టు బర్త్ వరల్డ్ రికార్డ్ 11 సన్స్ అంటూ క్యాప్షన్ పెట్టీ వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన హెడ్ ఫోటో ని తల్లి కి పెట్టి, పిల్లలకి మన ఇండియన్ ప్లేయర్ల ఫోటో లను మార్ఫింగ్ చేసి పెట్టారు. ఇక దానికి కమ్మిన్స్, ఫించ్, మాక్స్ వెల్ లు లైక్ లు కొట్టారు… ఇలా ఆస్ట్రేలియా వాళ్లు మన ఇండియన్స్ ని తక్కువ చేసి మాట్లాడడం హేళన చేస్తూ మార్ఫింగ్ చేస్తూ వీడియోలు, ఫోటోలు పెట్టడం చూసిన ఇండియన్ అభిమానులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆస్ట్రేలియన్ టీం ని ఉద్దేశించి మీరు కనక కప్పు కొట్టారు మరి అతి చేయాల్సిన పని లేదు అంటూ ఇండియన్ అభిమానులు ఆస్ట్రేలియా పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు…

ఇక వరల్డ్ కప్ లో జరిగిన అవమానానికి ఇండియన్ టీం మొదటి టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి వాళ్ల మీద రివేంజ్ ని తీర్చుకుందనే చెప్పాలి. ఇక నిజానికి ఈ మ్యాచ్ విజయంతో ఇండియన్ అభిమానులు అందరూ కూడా ఒక వంతుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులు ముందు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియన్ టీం ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ప్రతి అభిమాని కూడా కన్నీరు పెట్టుకున్నారు.

ఇక ఇండియన్ టీం ఒక గొప్ప విజయాన్ని టి20 మ్యాచ్ లో సాధించి ఆస్ట్రేలియా కి తగిన గుణపాఠం చెప్పింది అంటూ క్రికెట్ అభిమానులు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…ఇక ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు, చెత్త వీడియోలు చేయడం ఒక ఆస్ట్రేలియా కి మాత్రమే చెల్లింది. ఎందుకంటే వాళ్లంతా చిల్లర మైండ్ సెట్ ఏ దేశపు ప్లేయర్లకి ఉండదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…