Australia players mock india team: క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ అని పిలుస్తుంటారు. ఈ గేమ్ ఆడేవాళ్లు జెంటిల్మెన్ మాదిరిగా వ్యవహరించాలనేది నిబంధన. మొదట్లో అన్ని దేశాలు ఇలానే ఆడేవి. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేవి. గెలుపు కోసం చివరి వరకు పోరాటం చేసేది. కొన్ని సందర్భాల్లో విజయం దక్కేది. మిగతా సందర్భాల్లో వీర స్వర్గం లభించేది. కానీ ఆస్ట్రేలియా మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ప్రారంభం నుంచి ఆ జట్టు ధోరణి అలానే ఉండేది. క్రికెట్ లో స్ఫూర్తిదాయకమైన ఆట తీరును ప్రదర్శించాల్సింది పోయి.. ప్రతి మ్యాచ్లో గెలవాలి అనే ధోరణితో ఆడేది. అలాంటి విధానం తప్పుడుది కాకపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా ప్లేయర్లు గెలవడానికి ఎంతటి దుర్మార్గానికైనా వెనుకాడే వారు కాదు.
ఆస్ట్రేలియా క్రికెట్ లో ప్లేయర్లు ప్రత్యర్థి ఆటగాళ్లను దూషిస్తుంటారు. అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ హేళన చేస్తుంటారు. ప్రత్యర్థి ఆటగాళ్లు పరుగులు తీస్తుంటే సూటిపోటి మాటలు అంటూ ఇబ్బందికి గురి చేస్తుంటారు. చిత్ర విచిత్రమైన సంకేతాలు చేస్తూ ఆట మీద మనసు లగ్నం చేయకుండా చేస్తారు. అందువల్లే ఆస్ట్రేలియాతో ఆట అంటే ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు ఇబ్బంది పడుతుంటారు. అయితే కొంతకాలం నుంచి పరిస్థితిలో మార్పు వస్తోంది. ఈ మార్పుకు టీమిండియా శ్రీకారం చుట్టింది. టీమ్ ఇండియా ప్లేయర్లు ఆస్ట్రేలియా ప్లేయర్లకు తగ్గట్టుగానే గట్టి కౌంటర్ ఇవ్వడంతో పరిస్థితి మారిపోయింది.. అందువల్లే టీమిండియాతో మ్యాచ్ అంటే ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇప్పుడు భయపడిపోతున్నారు.
టీమిండియా తమకు గట్టి సమాధానం ఇవ్వడాన్ని ఆస్ట్రేలియా ప్లేయర్లు తట్టుకోలేకపోతున్నారు. అందువల్లే అప్పుడప్పుడు తమ బి గ్రేడ్ వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకుంటారు. అలాంటి సంఘటన ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆసియా కప్ లో టీమిండియా పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ అండ్ ఇవ్వలేదు. మొత్తం మూడు మ్యాచ్లలో తలపడితే పాకిస్తాన్ ప్లేయర్లతో కనీసం భారత ఆటగాళ్లు మాట వరసకు కూడా మాట కలపలేదు. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత కూడా ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ నుంచి ట్రోఫీ అందుకోవడానికి ఇష్టపడలేదు. అయితే ఈ వ్యవహారం ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఇబ్బందిగా అనిపించింది. వాస్తవానికి పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు వచ్చిన ఇబ్బంది ఏమిటో వారికే తెలియాలి.
భారత ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడానికి ఆస్ట్రేలియా ప్లేయర్లు ఎగతాళి చేశారు. ” వారికి ట్రెడిషనల్ గ్రీటింగ్స్ అంటే తెలియదు. అది వారి బలహీనత కూడా. మనం బౌలింగ్ చేయకపోతే వారిని ఓడించవచ్చు” అని ఓ యాంకర్ చెప్పాడు.. దీనికి ఆస్ట్రేలియా ప్లేయర్లు స్పందించారు.. దానికి బదులుగా మనం ఇలా చేద్దాం అంటూ ఆస్ట్రేలియా పురుష, మహిళ ప్లేయర్లు చేతులతో రకరకాల సంకేతాలు ఇచ్చారు. దీనిపై భారత నెటిజన్లు మండిపడ్డారు. ఫలితంగా ఈ వీడియోను kayo sports అనే ఛానల్ సామాజిక మాధ్యమాల నుంచి తొలగించింది. ఆయనప్పటికీ టీం ఇండియా అభిమానులు వెనక్కి తగ్గడం లేదు. ఆస్ట్రేలియా ప్లేయర్లపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.