https://oktelugu.com/

Aus Vs Namibia: 5.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది.. సూపర్ -8 కు ఆస్ట్రేలియా

నమిబియా విధించిన 73 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే చేదించింది. హెడ్ (34*: 17 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (20; 8 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్), మిచల్ మార్ష్ (18*: 9 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్) నమిబియా బౌలర్ల పై ఎదురుదాడికి దిగారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 12, 2024 2:12 pm
    Aus Vs Namibia

    Aus Vs Namibia

    Follow us on

    Aus Vs Namibia: టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా విజయ విహారం చేస్తోంది. గ్రూప్ – బీ లో ఆస్ట్రేలియా జట్టు హ్యాట్రిక్ విజయాలతో ఏకంగా సూపర్ -8 కు దూసుకెళ్లింది. వెస్టిండీస్ లోని ఆంటిగ్వా బుధవారం నమిబీయా జట్టుతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది.. బంతితో ప్రత్యర్థి జట్టును వణికించిన ఆస్ట్రేలియా.. తర్వాత బ్యాట్ తో సత్తా చాటింది. 9 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించి అదరగొట్టింది.. ఆడం జంపా (4/12) బౌలింగ్ ధాటికి నమిబియా 17 ఓవర్లలోనే 72 పరుగులకు కుప్పకూలింది. ఏరాస్మస్ (36) టాప్ స్కోరర్ గా నిలిచాడు.

    5.4 ఓవర్లలోనే..

    నమిబియా విధించిన 73 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే చేదించింది. హెడ్ (34*: 17 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (20; 8 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్), మిచల్ మార్ష్ (18*: 9 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్) నమిబియా బౌలర్ల పై ఎదురుదాడికి దిగారు. డేవిడ్ వైసి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. స్వల్ప లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా.. మొదటి బంతికే వార్నర్ వికెట్ కోల్పోయేది. రూబెన్ వేసిన బంతిని సింగిల్ తీసేందుకు వార్నర్ ప్రయత్నించాడు. ఫీల్డర్ నేరుగా బంతిని వికెట్ల వైపు వేస్తే అవుట్ అయ్యేవాడు. అయితే అతడు అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు.. ఇలా లభించిన జీవధానాన్ని వార్నర్ సమర్ధవంతంగా ఉపయోగించుకున్నాడు. తొలి ఓవర్ లో ఒక బౌండరీ మాత్రమే సాధించిన అతడు.. ఆ తర్వాతి ఓవర్లో వీర విహారం చేశాడు. డేవిడ్ బౌలింగ్లో రెండు ఫోర్లు, ఒక ఫిక్సర్ కొట్టాడు. నాలుగో బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించి.. వార్నర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హెడ్ రంగంలోకి దిగి సునామి తరహా ఇన్నింగ్స్ ఆడాడు. మూడో ఓవర్లో మార్ష్ ఒక సిక్స్, ఫోర్ కొట్టడంతో 19 పరుగులు సాధించాడు. ఆ తర్వాత వీరిద్దరూ అదే జోరు కొనసాగించి 5.4 ఓవర్ లోనే మ్యాచ్ ను ముగించారు.

    టాస్ ఓడిన నమిబియా జట్టు బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. 72 పరుగులకే కుప్ప కూలింది. నమిబియా కెప్టెన్ గెర్హార్డ్ పోరాటం ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది. ఒకానొక దశలో 43 పరుగులకే నమీబియా 8 టికెట్లు కోల్పోయింది. 50 పరుగులకే ఆ జట్టు కుప్పకూలుతుందని అందరూ భావించారు. కానీ గెర్హార్డ్ ఒంటరి పోరాటం చేశాడు. ఒక్కొక్క పరుగు తీస్తూ స్కోర్ బోర్డును క్రమంగా కదిలించాడు. గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా నాలుగు, హజిల్ వుడ్, స్టోయినిస్ చెరో రెండు, కమిన్స్, నాథన్ ఎలిస్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.