AUS Vs NZ: గ్లెన్ ఫిలిప్స్ పాంచ్ పటాకా.. ఆస్ట్రేలియా ఆల్ అవుట్.. కివీస్ ముందు భారీ లక్ష్యం

న్యూజిలాండ్ కీపర్ ఫిలిప్స్ ఖవాజా, గ్రీన్, హెడ్, మార్ష్, క్యారీ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా కోలుకోలేక పోయింది.. ఫిలిప్స్ కు హెన్రీ, సౌతి తోడుగా నిలిచారు.

Written By: Suresh, Updated On : March 2, 2024 11:44 am
Follow us on

AUS Vs NZ: రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా వెల్డింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ రికార్డు సృష్టించాడు. రెండవ ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ ను బెంబేలెత్తించాడు. రెండు వికెట్ల నష్టానికి 15 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో రెండవ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఫిలిప్స్ ధాటికి 164 పరుగులు చేసింది.. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లయన్(41), గ్రీన్ (34), హెడ్ (29), ఖవాజా(28) పరుగులు చేసి రాణించారు. మిగతావారు న్యూజిలాండ్ బౌలర్లకు దాసోహం అయ్యారు. ఐదో వికెట్ కు హెడ్, మార్ష్ చేసిన 46 పరుగులే ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ లో అత్యుత్తమ భాగస్వామ్యం అంటే.. వారి బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

న్యూజిలాండ్ కీపర్ ఫిలిప్స్ ఖవాజా, గ్రీన్, హెడ్, మార్ష్, క్యారీ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా కోలుకోలేక పోయింది.. ఫిలిప్స్ కు హెన్రీ, సౌతి తోడుగా నిలిచారు. ఒకరు మూడు, మరొకరు రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు 164 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అంతకుముందు తొలి యూనికాన్సులో అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు గ్రీన్(174) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో 383 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 179 పరుగులు చేసింది. ఒకానొక దశలో 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న న్యూజిలాండ్ జట్టును ఫిలిప్స్ ఆదుకున్నాడు. 70 బంతుల్లో 13 ఫోర్ల సహాయంతో 71 పరుగులు చేశాడు.. ఇక రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.. లాథం, యంగ్, విలియంసన్ నిరాశపరిచారు.. ప్రస్తుతం క్రీజ్ లో రచిన్ రవీంద్ర(25), మిచెల్(4) ఉన్నారు. న్యూజిలాండ్ విజయానికి ఇంకా 302 పరుగులు కావాలి. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ప్రస్తుతం మైదానం బౌలర్లకు అనుకూలిస్తోంది. ఆస్ట్రేలియా బౌలర్లను కాచుకున్న విధానాన్ని బట్టి న్యూజిలాండ్ విజయం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే మూడు టి20 ల సిరీస్ ను న్యూజిలాండ్ 3-0 తేడాతో కోల్పోయింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో లయన్ రెండు, హెడ్ ఒక వికెట్ తీశారు.. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన విలియంసన్, లాథం, యంగ్ రెండవ ఇన్నింగ్స్ లోనూ నిరాశపరిచారు.. పేలవమైన బ్యాటింగ్ తో ఔట్ అయ్యారు. దీంతో న్యూజిలాండ్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు.. 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 59 పరుగుల వద్ద మూడో వికెట్ చేజార్చుకుంది. భారతీయ మూలాలు ఉన్న రచిన్ రవీంద్ర తొలి ఇన్నింగ్స్ లో విఫలమైనప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్ లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చిందించేలాగా బంతులను సంధిస్తున్నారు.