Rajamouli: రాజమౌళి నాస్తికుడా? దేవుడిని నమ్మడా?

రాజమౌళి దేవుడిని, మతాన్ని నమ్మరనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ విషయాలను స్వయంగా వెల్లడించారు.

Written By: Swathi, Updated On : March 2, 2024 11:51 am
Follow us on

Rajamouli: స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా హిట్ లను సొంతం చేసుకున్నాయి. కానీ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ రిజల్ట్ ను చవిచూడలేదు. కథ సాధారణంగా ఉన్నా సూపర్ హిట్ ను సొంతం చేసుకోవడం ఆయనకే సొంతం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఆయనకు సాటి లేరని నిరూపించుకున్నారు. మన తెలుగు సినిమాల సత్తాను ఖండాలు దాటేలా చేశారు ఈ స్టార్ డైరెక్టర్.

అయితే రాజమౌళి దేవుడిని, మతాన్ని నమ్మరనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ విషయాలను స్వయంగా వెల్లడించారు. అయితే వేర్వేరు సందర్భాల్లో జక్కన్న దేవాలయాల్లో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట తెగ వైరల్ గా మారాయి. అయితే రాజమౌళి తను దేవుడిని నమ్మకపోయినా తనతో ఉండే వ్యక్తుల ఫీలింగ్స్ కు ఎంతో గౌరవం ఇస్తారు. ఈ రీజన్ వల్ల జక్కన్న అందరి వాడయ్యారు అంటారు కొందరు.

రీసెంట్ గా జక్కన్న బళ్లారి లోని ఒక ఆలయాన్ని దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా రాజమౌళి నాస్తికుడు అని తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈయన సినిమాలో దేవుడిని నమ్మేలా చాలా సీన్లు ఉంటాయి. కానీ ఈయన మాత్రం దేవుడిని మాత్రం నమ్మడా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు.

జక్కన్న సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. మరి మహేష్ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాలి. ఇక రాజమౌళి స్ట్రిప్ట్ సెలక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే ఈయన సినిమాలు మంచి సక్సెస్ ను సాధిస్తాయి. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కానీ ఈయన మెంటాలిటీ వల్లనే ఇప్పటికీ ఒక్క ఫ్లాప్ కూడా లేదు అంటారు అభిమానులు. మరి మహేష్ సినిమాతో ఎలాంటి రిజల్ట్ వస్తుందో..